జైలులో ఉన్న‌ప్పుడే హయిగా నిద్ర‌పోయాను, ఇప్పుడు అస్సలు నిద్రరవడం లేదు : స‌ల్మాన్ ఖాన్

divyaamedia@gmail.com
2 Min Read

తాజాగా సల్మాన్‌ ఖాన్‌ ఓ పాడ్‌ కాస్ట్‌లో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇంతకీ, ఆ విశేషాలు ఏమిటో ఆయన మాటల్లోనే విందాం. ‘నేను సాధారణంగా రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్ర పోతాను. నెలకోసారి మాత్రం 8 గంటలు పడుకుంటాను. కొన్నిసార్లు సినిమా చిత్రీకరణ సమయంలో సన్నివేశాల మధ్య విరామం వచ్చినప్పుడు కాసేపు కునుకు తీస్తాను’ అని సల్మాన్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న సల్మాన్.. తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తాను చాలా తక్కువ నిద్ర పోతానని.. జైల్లో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ నిద్రపోయానని చెప్పారు. తాను సాధారణంగా రోజుకు 2 గంటలు మాత్రమే నిద్రపోతానని.. నెలకోసారి మాత్రమే 8 గంటలు పడుకుంటానని తెలిపారు. కొన్నిసార్లు సినిమా షూటింగ్ సమయంలో విరామం దొరికినప్పుడు కాస్త కునుకు తీస్తానని చెప్పారు. షూటింగ్ లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు కావాల్సినంత నిద్ర పోతానని అన్నారు. అందుకే జైల్లో ఉన్నప్పుడు హాయిగా 8 గంటలు నిద్రపోయానన్నారు. ఒకవేళ తాను ప్రయాణం చేసే విమానంలో సాంకేతి సమస్య వచ్చి అల్లకల్లోలం అయినా తాను మాత్రం నిద్రపోతానని అన్నారు.

ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఏం చేయలేము కాబట్టి అంటూ నవ్వులు పూయించారు. తాను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు సల్మాన్. తాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తన తండ్రి యాక్షన్ చేయగలవా? పది మందిని కొడతావా? ఇలా ఎన్నో ప్రశ్నలు వేశారని.. లాయరో, పోలీసో కావచ్చు కాదా అని అన్నారని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. కానీ తాను మాత్రం యాక్టర్ కావాలని బలంగా అనుకున్నానని తెలిపారు. ఇండస్ట్రీలో పోటీ ఎక్కువగా ఉంటుంది. జీవితంలో సీరియస్‌గా ఉండాలి. తోటి నటులతో పోల్చుకుంటూ ముందుకు సాగాలి.

కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. అయితే సల్మాన్ రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్ర పోతానని చెప్పడంతో ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానులు పలు సూచనలు చేస్తున్నారు. కనీసం 6 గంటలైనా నిద్రపోండి సర్ అంటూ సలహాలు ఇస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *