ఆడపులిగా ఆట ఆడి.. అఖిల్‌ని ఆడ.. అంటూ ఓ ఆట ఆడించి.. ఫైనల్లో అతన్ని మట్టికరిపించి బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా నిలిచింది బిందు మాధవి. నీ ముందే టైటిల్ గెలుస్తా.. నా సత్తా ఏంటో చూపిస్తానంటూ నటరాజ్ మాస్టర్ ముందు సవాల్ చేసి అన్నట్టుగానే అతని ముందే టైటిల్ గెలుచుకుంది. అయితే జనవరి 13న అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుక ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగమవుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మహా కుంభమేళాలో పాల్గొంటున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం తమ ఆధ్యాత్మిక యాత్ర కు సంబంధించిన ఫొటోలు, విశేషాలను అందరితో షేర్ చేసుకుంటున్నారు. పూనమ్ పాండే, యాంకర్ లాస్య, హేమమాలిని, సంయుక్త మేనన్, శ్రీనిధి శెట్టి, పవిత్ర గౌడ.. ఇలా ఎందరో సినీ తారలు ఇప్పటికే కుంభమేళాను దర్శించుకున్నారు.
తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ బింధు మాధవి మహా కుంభమేళాలో తళుక్కుమంది. తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించింది. అనంతరం తన మహా కుంభమేళ యాత్ర ఫొటోలను, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మదన పల్లెకు చెందిన బిందు మాధవి ఆవకాయ్ బిర్యానీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆతర్వాత బంపరాఫర్, ఇంకోసారి, రామ రామ కృష్ణ కృష్ణ, పిల్ల జమీందార్ తదితర తెలుగు హిట్ సినిమాల్లో నటించింది. ఇక తమిళంలోనూ పలు సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించిందీ అందాల తార. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మ్యాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్ లతో ఓటీటీ ఆడియెన్స్ నూ మెప్పించింది.