ప్రయాగరాజ్ లో జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవం కోసం భారతీయ రైల్వే సంస్థ పెద్ద సంఖ్యలో రైళ్లను అందుబాటులో ఉంచింది. దేశ వ్యాప్తంగా సుమారు 13 వేళ రైళ్లను కుంభమేళా కోసం కేటాయించింది. వీటిలో 3 వేల ప్రత్యేక రైళ్లు ఉండగా, మిగతావి రెగ్యులర్ రైళ్లు. కుంభమేళాకు వచ్చిపోయే భక్తలుతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. అయితే కొంత మంది పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బాధలకు గురిచేస్తూ అనాధశ్రమాలు, నడిరోడ్డు మీద వదిలిపెట్టి వెళ్తుంటారు.
ఇలాంటి హృదయవిదారక వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనలే కుంభమేళాలో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రయాగ్‌రాజ్ నుండి వచ్చినట్టుగా తెలిసింది. వీడియో ప్రకారం.. అక్కడి పరిసరాలు కుంభమేళాకు సంబంధించినవిగా తెలుస్తోంది. ఇందులో రాత్రి సమయంలో చలిలో వణుకుతున్న ఓ వృద్ధ జంటను చూసిన కొందరు వ్యక్తులు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
వారిలో ఒక వ్యక్తి వారికి కొంత డబ్బు కూడా ఇచ్చాడు. వారిలో ఒకతను ఆ వృద్ధ జంట వివరాలు అడుగుతున్నాడు. మీరు ఎక్కడ్నుంచి వచ్చారు.. మీకు పిల్లలు ఉన్నారా.. అని అడుగుతున్నారు.. ఇందతా మిగిలి వారిలో ఒకరు తమ సెల్‌ఫోన్‌తో వీడియో తీశారు. కాగా, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆ వృద్ధులు ..’మాకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు ఉన్నారు.
పిల్లలు మమ్మల్ని విడిచిపెట్టారని చెప్పారు. మా ముగ్గురూ కోడళ్లు దుర్మార్గులు అంటూ ఆవేదనగా చెప్పారు.. మా నగరంలో మహా కుంభ్‌మేళ జరుగుతోందని, గంగలో పుణ్య స్నానం కోసం వెళ్తున్నామని చెప్పారు. కాగా, వారికి సహాయం చేస్తున్న వ్యక్తి తాను నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటున్నానని, ఉదయాన్నే వచ్చి తమను ఆశ్రమానికి తీసుకెళ్తానని చెప్పారు.