ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌..! ఆనందంలో కోట్లాది మంది ఎయిర్‌టెల్ వినియోగదారులు.

divyaamedia@gmail.com
1 Min Read

ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఈ దిగ్గజ టెలికాం కంపెనీలు తమ కస్టమర్ల కోసం డేటా లేకుండా రెండు చవకైన రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగాయని ఆందోళన చెందుతున్న చందాదారులకు ఊరట కలిగించే వార్తను ప్రకటించాయి. అయితే ఎయిర్‌టెల్ ఆఫర్ ప్రయోజనం కంపెనీ చౌకైన రూ. 499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో లభిస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు ప్రతి నెలా 50 GB హై స్పీడ్ డేటా, అపరిమిత ఉచిత కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలను పొందుతారు. టెలికాం టాక్ నివేదిక ప్రకారం..

మీరు ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కు మారితే మీకు కంపెనీ అదనంగా 25 GB హై స్పీడ్ డేటాను ఉచితంగా అందిస్తుంది. 50 GB డేటాతో పాటు 25 GB అదనపు ఉచిత డేటా ప్రయోజనం పొందుతారు. ఈ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో 200 GB వరకు డేటా రోల్‌ఓవర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. పూర్తి డేటా వినియోగం తర్వాత MBకి 2 పైసలు ఛార్జ్ అవుతుంది. డేటా, కాలింగ్, SMS కాకుండా మీరు అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, 3 నెలల పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం, ఉచిత హలో ట్యూన్, బ్లూ రిబ్బన్ బ్యాగ్ సర్వీస్ ప్రయోజనాలను పొందుతారు.

మూడు నెలల తర్వాత ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు రూ. 99 ఛార్జ్ చేయబడుతుంది. మీరు కోరుకుంటే, మీరు సేవను కూడా నిలిపివేయవచ్చు. ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కు మారడం అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, వినియోగదారులు 200 GB డేటా రోల్‌ఓవర్ సౌకర్యాన్ని పొందుతారు. OTT ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే రూ.449 ప్లాన్‌పై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *