10 రూపాయల నాణెం చెల్లుతుందా..? ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు.

divyaamedia@gmail.com
2 Min Read

నిజానికి పది రూపాయల నోటు కన్నా పది రూపాయల నాణాలను స్వీకరించినట్లయితే ఇవి ఎక్కువ కాలం చెల్లుబాటులో ఉంటాయి. పది రూపాయల నోట్లు వాడకం ఎక్కువగా ఉండటం వల్ల అవి చినిగిపోయే ప్రమాదం ఉంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని విలువ తక్కువగా ఉన్న కారణంగా పది రూపాయల నాణాలను ఆర్బిఐ ప్రవేశపెట్టింది. కానీ వ్యాపారులు మాత్రం పది రూపాయల నాణేల విషయంలో అపోహలను నమ్మి, కస్టమర్ల వద్ద నుంచి పది రూపాయల కాయిన్స్ తీసుకోవడం మానేస్తున్నారు. అయితే పాత కరెన్నీ రద్దు తరువాత దాదాపు మూడేళ్లకు అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి దీనిని 2005లోనే తయారు చేశారు.

రూ. 10 నోట్ల ముద్రణ ఖర్చు కంటే నాణెం ఖర్చు తక్కువగా ఉండడంంతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2009 నుంచి 2017 సంవత్సరాల మధ్య మొత్తం 14 సార్లు రూ.10 నాణెలు విడుదలయ్యాయి. అయితే దేశంలో చాల చోట్ల రూ.10 నాణెల నిల్వలు పేరుకుపోయాయి. ఇటీవల విజయవాడకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ రూ. 10 నాణెంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతం కరెన్సీ వాడకం తగ్గిపోయింది. అంతా ఆన్ లైన్ లోనే మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటున్నారు.

దీంతో రూ. 10 అవసరం ఉన్నా ఫోన్ పే ద్వారా పంపుతున్నారు. ఈ నేపథ్యంలో రూ.10 కాయిన్ చెలామణి తక్కువ అయింది. ఇలా కొన్ని చోట్ల రూ. 10 కాయిన్ నిల్వలు ఉండడంతో ఎక్కువగా చెలామణి లేకుండా పోయింది. ఈ క్రమంలో మార్కెట్లో ఎక్కువగా ఈ నాణెం కనిపించకపోవడంతో అసలు రూ. 10 నాణం చెలామణిలో ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని గ్రహించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించింది.

ఈ సందర్బంగా కొందరు బ్యాంకు మేనేజర్లు మాట్లాడుతూ చిరిగిన నోట్లతో పాటు రూ.10 నాణెలనుకూడా స్టోర్ చేయాల్సి వస్తోందని అన్నారు. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చూస్తోంది. ఎవరైనా రూ. 10 నాణెం తీసుకోను అని అంటేచర్యలు తీసుకోవాలనే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. గతంలోనూ రూ. 10 నాణెంపై అనిశ్చితి నెలకొంది. కానీ ఆ తరువాత రూ.10 నోట్ల రాక తగ్గడంతో చాలా మంది నాణెలను ఉపయోగించారు. కానీ ఇప్పుుడు మరోసారి ఇవి మార్కెట్లోకి ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *