అఘోరాలు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే తపస్సు చేయరు. వీరు జీవితాంతం తపస్సు చేస్తారు. అదే సమయంలో అఘోరీలకు బ్రహ్మచర్య నియాలేవీ ఉండవు. వీరు తంత్ర సాధన అభ్యసిస్తారు. కొన్నిసార్లు శ్మశానవాటికల్లో లేదా ఇతర రహస్యమైన ప్రాంతాల్లో తంత్ర సాధనలు చేస్తూ కనిపిస్తారు. సాధారణంగా నాగ సాధువులు, అఘోరాలు ఒకేలా కనిపిస్తారు. అయితే నాగ సాదువులు, అఘోరాలు ఇద్దర కూడా శివుని భక్తులే.
అయితే అఘోరాలు శివుడితో పాటు కాళీ దేవీని కూడా ఆరాధిస్తారు. అఘోరీలు ఎక్కువగా కాపాలిక సంప్రదాయాన్ని అనుసరిస్తారు. నాగ సాధువులు శివుని ఆరాధకులు, వారు శివలింగంపై బూడిద, నీరు, బిల్వ పత్రాలు సమర్పిస్తారు. వీరు ఎక్కువగా హిమాలయాలు, అడవులు, గుహలకు వెళ్లి తపస్సు చేస్తుంటారు. అఘోరాలు శివుడితో పాటు కాళీ దేవిని కూడా ఆరాధిస్తారు.
వీరి పూజ నాగ సాధువుల మాదిరిగా కాకుండా పూర్తి భిన్నంగా ఉంటుంది. అఘోరాలు మృతదేహం, శివుడు, దహన విధానం వంటి మూడు రకాల సాధనలను నిర్వహిస్తారు. మృత దేహ సాధనలో, మాంసాహారం, మద్యం సమర్పించి అఘోరీలను పూజిస్తారు. అలాగే శివసాధనలో మృత దేహంపై ఒంటికాలిపై నిలబడి తపస్సు చేస్తుంటారు.
వీరిద్దరి మధ్య కేవలం పూజా విధానంలో మాత్రమే కాస్త తేడాలు ఉంటాయి. వీరిద్దరూ కూడా శివుడిని భక్తితో పూజిస్తారు. ఎంతో పవిత్రంగా ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు పూజిస్తారు. పవిత్రంగా శివుడిని తపస్సు చేస్తుంటారు.