విదేశాల నుంచి వచ్చిన ఓ ట్రైవెల్ ఇన్‌ఫ్లూయన్సర్ కొందరు వ్యాపారుల చేతిలో ఎలా మోసపోయాడో చూపించే సంఘటన ఈ వీడియో. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. hello@hughabroad.com పేరుతో ట్రావెల్ వీడియోలు చేసే ఓ స్కాట్‌లాండ్ వ్యక్తి ఈ మధ్య కాలంలో హైదరాబాద్ వచ్చాడు. చాలా ప్రాంతాలు తిరుగుతూ అక్కడ పర్యాటకంతోపాటు స్థానికంగా లభించే ఫుడ్‌ను ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అయితే రష్య నుంచి వచ్చిన ఫారెనర్ కు వింత అనుభవం ఎదురైంది.
సాధారణంగా విదేశాల నుంచి కొత్త ప్రదేశాలకు టూరిస్టులు వెలితే కొంత మంది ఉన్న ధరల కన్నా.. నాలుగింతల రేట్లు చెప్తుంటారు. వారికి భాష, ఇక్కడ రేట్లు తెలీదని కొందరు వాళ్లను దోచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఒక టూరిస్టు.. రోడ్డు మీద తోపుడు బండి మీద అరటి పండు కొనేందుకు ప్రయత్నించాడు.
అతను అరటి పండ్లు అమ్మేవాడ్ని.. ఒక బనానా ఎంత అని అడగ్గా.. అతను రూ. 100 అని ఆన్సర్ చెప్పాడు. దీంతో ఫారెనర్ ఖంగుతిన్నాడు. ఒక అరటి పండు వంద రూపాయల అంటూ ఆశ్చర్యపోయి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనను వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో హైదరాబాద్ లో రూ. 100 కి ఒక బనానా అంటూ వైరల్ చేశారు . దీంతో ఇది వార్తలలో నిలిచింది.