నాగ సాధువులు హిమాలయాలు , గుహలలో నివసిస్తున్నారు. వారు తరచుగా అఖాడా, ఆశ్రమం లేదా దేవాలయంతో సంబంధం కలిగి ఉంటారు. సమూహాలలో నివసిస్తున్నారు. వీరిలో కొందరు ఋషులు హిమాలయాలకు, గుహలకు వెళ్లి తపస్సు చేస్తారు. నాగ సాధువులు నగ్నంగా ఉంటూ ఒంటినిండా బూడిదతో కనిపిస్తుంటారు. అయితే చాలా మంది అసలు వారు నగ్నంగా ఎందుకు ఉన్నారు అని ఆలోచిస్తుంటారు. కాగా, అసలు నాగ సాధువులు నగ్నంగా ఉండటానికి గల కారణాలు ఏంటీ? వారు ఎందుకు అలా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
నాగ సాధువులు కొన్ని సంవత్సరాలు ఒక గుహలో ఉండి ధ్యానం చేస్తే మరికొన్ని రోజులు మరో గుహలోకి వెళ్తుంటారు. అంతే కాకుండా వీరు ఎక్కువగా వేర్లు, దుంపలు తిని తమ జీవనాన్ని సాగిస్తారు. ఒక్కోసారి వారు ఏడు ఇళ్లల్లో భిక్షాటన చేసే అవకాశం ఉంటుంది. ఏడు ఇళ్లల్లో ఎంత ఆహారం దొరికితే అంత వారు తినగలరు.. ఒక వేళ ఆహారం దొరకకపోతే వారు పస్తులుండాల్సిందేనంట. ఇక వారు నగ్నంగా ఉండటానికి ఒక బలమైన కారణం ఉన్నదంట. నాకు పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, మంచి జాబ్, ఇల్లు ఇలాంటి కోరికలు లేవు, అవన్నీ కొన్ని రోజులు మాత్రమే సుఖంగా ఉంటాయి. తర్వాత అవి కష్టమైనవే.. ఈ సృష్టి మొత్తం కూడా నాశనం అవుతుంది.

కాబట్టి దానికి సింబల్ గా బూడిద రాసుకుంటారు. అలాగే నాశనం కానిది దేవుడు ఒక్కడే అని వారు విశ్వసిస్తారు. ఈ క్రమంలో దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు.. ఉంటాడు.. అనేదానికి సూచనగా నగ్నంగా ఉంటారంట. నాగ సాధువులు ప్రకృతికి, సహజ స్థితికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో ఎవరైనా ప్రపంచంలోకి నగ్నంగా వస్తారని.. ఈ స్థితే సహజమని నాగ సాధువులు విశ్వసిస్తారు. ఈ భావన వల్ల నాగ సాధువులు దుస్తులు ధరించరు అని చెబుతుంటారు. అలాగే శరీరంపై బూడిదను పూయడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షించబడతారని భావిస్తారు. అందుకే వారు శరీరంపై బూడిద పూసుకుని నగ్నంగా ఉంటారు.