మీ భూమి, ఇంటిని ఎవరైనా ఆక్రమించారా..? ఇలా ఫిర్యాదు చేస్తే మీ ఆస్తి వెంటనే తిరిగి పొందొచ్చు.

divyaamedia@gmail.com
2 Min Read

భారతదేశంలో భూమిని ఆక్రమణ నేరంగా పరిగణిస్తారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 441 (ప్రస్తుతం ఇండియన్ జ్యుడీషియల్ కోడ్) భూమి మరియు ఆస్తిపై ఆక్రమణకు సంబంధించిన కేసులకు వర్తిస్తుంది. ఎవరైనా భూమి, ఇల్లు లేదా ఇతర ఆస్తులను అక్రమంగా ఆక్రమించినట్లయితే, ముందుగా పోలీసు, భూ రెవెన్యూ విభాగానికి తెలియజేయండి. ఆరోపణలు నిజమని తేలితే, కోర్టు ఆక్రమణను నిషేధించవచ్చు. పరిహారం చెల్లించమని ఆదేశించవచ్చు. అయితే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిని బంగారంలా ఇతరులు దొంగిలించలేరు. కాబట్టి ఇది సురక్షితమైన పెట్టుబడిగా చాలా మంది భావిస్తారు. కానీ, భూమి, ఇంటితో ఎల్లప్పుడూ ఒక ప్రమాదం ఉంటుంది.

ఎందుకంటే ఇది వ్యాపారం. ప్రత్యేకించి మీరు ఇంటిని లేదా ఖాళీ స్థలాన్ని ఎవరికైనా అద్దెకు ఇచ్చినప్పుడు లేదా కొనుగోలు చేసిన తర్వాత దానిని పట్టించుకోనప్పుడు. చాలా మంది ఖాళీ స్థలాలను ఆక్రమించి తాత్కాలిక నిర్మాణాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా రోజురోజుకు భూమి, ఇళ్లు కబ్జాలకు సంబంధించిన వివాదాలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. ఈ భూములకు సంబంధించిన వివాదాల కోసం ప్రజలు కూడా పోలీస్ స్టేషన్లు, కోర్టులకు వెళుతున్నారు. అటువంటి వివాదాలకు చట్టపరమైన పరిష్కారం చాలా కాలం సమయం పడుతుంది. కాబట్టి మీరు కోర్టుకు వెళ్లవలసిన పరిస్థితి తలెత్తకూడదు. ఆక్రమణ లేదా అక్రమ ఆక్రమణ భారతదేశంలో నేరంగా పరిగణించబడుతుంది.

దీనికి చట్టపరమైన నిబంధనలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో, భూమి ఆక్రమణను ఎదుర్కోవటానికి చట్టపరమైన మార్గాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. చట్టం ఏం చెబుతోంది?: భారతదేశంలో భూమిని ఆక్రమణ నేరంగా పరిగణిస్తారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 441 భూమి, ఆస్తిపై ఆక్రమణకు సంబంధించిన కేసులకు వర్తిస్తుంది. ఒక వ్యక్తి తప్పుడు ఉద్దేశ్యంతో చట్టవిరుద్ధంగా భూమిని లేదా ఇంటిని స్వాధీనం చేసుకుంటే, అతనికి సెక్షన్ 447 ప్రకారం జరిమానా, 3 నెలల కఠిన శ్రమతో శిక్షించవచ్చు. మీ ఆస్తి అక్రమంగా ఆక్రమిస్తే ఏమి చేయాలి? ఇంతలో ఎవరైనా మీ భూమిని లేదా ఆస్తిని అక్రమంగా ఆక్రమించినట్లయితే, ముందుగా సంబంధిత అధికారులకు నివేదించండి.

భూ యజమాని ఆక్రమణదారులపై దావా వేయవచ్చు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత, కోర్టు ఆక్రమణను నిలిపివేయవచ్చు, నష్టపరిహారాన్ని కూడా ఆదేశించవచ్చు. భూమి ఆక్రమణకు గురైనట్లయితే భూమి విలువ ఆధారంగా పరిహారం మొత్తాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. అక్రమ ఆక్రమణ సమయంలో మీ ఆస్తికి ఏదైనా నష్టం జరిగితే ఫిర్యాదుదారు ఆర్డర్ 39లోని రూల్ 1, 2, 3 కింద పరిహారం పొందవచ్చు. అలాగే భూమి ఆక్రమణ సమస్యను కూడా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చు. వీటిలో మధ్యవర్తిత్వం, భూమిని విభజించడం, ఆస్తిని విక్రయించడం , అద్దెకు ఇవ్వడం వంటి ఎంపికలు ఉన్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *