ఈరోజుల్లో అన్నీ మారాయి. కానీ అత్తా కోడళ్ల మధ్య వైరం మారలేదు.. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది.ఏదో ఒక చిన్న అంశంలోనైనా ఇద్దరి మధ్య తీవ్ర స్థాయి చర్చ జరుగుతుంది. అది కాస్త గొడవకు దారి తీస్తుంది. చాలా ఇళ్లల్లో వేరు కాపురాలు పెట్టుకోవడం చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. అయితే భారత మాజీ సైనికాధికారి కల్నల్ CS గంగూలీ తన తల్లిని 2015 జనవరి 14న కోల్పోయాడు. తన కళ్లముందే తల్లి చనిపోవడాన్ని చూశాడు. చనిపోయిన తల్లిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
అయితే గంగూలీ భార్య చనిపోయిన అత్తగారిని మరో మార్గంలో బతికించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సిలికాన్ ఆర్టిస్ట్ సుబిమల్ దాస్ ను సంప్రదించింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబంలోని ఎవరికీ చెప్పలేదు. రేఖ పెద్ద కుమార్తె తన్నిష్ఠ గంగూలీ కళాకారిణి కాబట్టి, తన కుమార్తె సహాయంతో, ఆమె తన అత్తగారి చిత్రంతో సుబిమల్ దాస్‌ను సంప్రదించింది. విగ్రహాన్ని తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. విగ్రహం పూర్తయిన తర్వాత ఎవరికీ తెలియకుండా ఇంటికి తీసుకొచ్చింది.
ఈ క్రమంలో కల్నల్ హాల్‌లో కూర్చొన్న తన తల్లిని చూసి షాక్ తిన్నాడు. ఒక్క క్షణం పాటు తన తల్లి మళ్లీ బతికి వచ్చిందా అని భ్రమపడ్డాడు కూడా. అకస్మాత్తుగా, చనిపోయిన వ్యక్తి భౌతికంగా కుర్చీపై కూర్చోవడం చూసి అందరూ షాక్ అయ్యారు. సుబిమల్ దాస్ చేతి స్పర్శతో దాదాపు పదేళ్ల క్రితం మరణించిన అత్తగారు సిలికాన్ మోడల్‌లో సజీవంగా మారింది.
ఇది చూసి కొడుకుతో సహా గంగులీ కుటుంబంలోని చాలా మంది కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ సంఘటన అత్తగారికి, కోడలికి మధ్య ఉన్న అనుబంధానికి కొత్త ఉదాహరణ తెలిపింది. ఇది సమాజంలో కూడా అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ప్రముఖ సిలికాన్ కళాకారుడు సుబిమల్ దాస్‌కు కుటుంబం మొత్తం కృతజ్ఞతలు తెలిపారు.