జనావాసాల్లోకి చిరుతలు ఎందుకు వస్తాయో తెలుసా..? అసలు విషయమేంటో తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

శేషాచల అడవుల్లో చిరుతలు సుమారు 50కి పైగా వుంటాయని అంచనా. అడవిలో వాటి సంఖ్య పెరిగే కొద్దీ సులువుగా దొరికే ఆహారం కోసం అడవి దాటి బయటకు రావడం కూడా పెరుగుతోంది. అడవిలో అయితే జింకలు, అడవిపందులు వంటి వాటిని వెంటాడి వేటాడాలి. అదే రోడ్డు దాటి దక్షిణానికి వస్తే విద్యాసంస్థల ఆవరణల్లో కుక్కలు, జింకలు, అడవిపందులు సులువుగా దొరికే అవకాశముంది. అందుకే ఈ వైపు చిరుతల కదలికలు క్రమేపీ పెరుగుతున్నాయి.

అయితే ఆత్మకూరు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ సాయి బాబా చెప్పిన కథనం ప్రకారం.. చిరుతలు పెద్దపులులకు ప్రధాన ఆహారం అడవి పంది పిల్లలు. ఎక్కువగా చిరుతలు పార్టీ ఆహారంపైనే ఆధారపడి జీవిస్తుంటాయి. అయితే ఇటీవల అభయారణ్యంలో పంది పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎందుకంటే.. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్‌తో అడవి పందులు బాధపడుతున్నాయట. ఈ వైరస్‌కి అందులో అడవిలో ఎక్కువగా చనిపోతున్నాయట.

అందుకని అడవి పంది పిల్లలు పెద్ద పులులు చిరుతలకు ఆహారంగా రావడం లేదు. పంది పిల్లల తర్వాత ప్రధాన ఆహారం చిరుతలకు కుక్కలే. దీంతో కుక్కల కోసం చిరుతపులను జనావాసాల్లోకి వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. అందులో భాగంగానే శ్రీశైలం చుట్టుపక్కల చిరుతపులలు తరచుగా తిరుగుతున్నాయి. ఏకంగా పూజారి ఇంటి ఆవరణలోకి చిరుత పులి వచ్చి వెళ్లడం సీసీ కెమెరాలలో స్పష్టంగా కనిపించడంతో స్థానికంగా భయభ్రాంతులకు గురవుతున్నారు.

దీనిపై అటవీశాఖ అధికారులు స్పందించారు. అయితే ఈ వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టగలిగామని, అయినప్పటికీ మూడేళ్ల పాటు వైరస్ గాలిలో ఉంటుందని, ఆ తర్వాత వాతావరణం లో వేడికి చనిపోతుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. భక్తులు స్థానికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *