గోపరాజు సమరం.. కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల నుండి ఎం.బీ.బీ.ఎస్. పట్టా పొంది సమరం 1970లో విజయవాడలో వైద్యునిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. వందలాది ఉచిత వైద్యశిబిరాలు, టీకావైద్యం క్యాంపులు, నేత్ర శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పోలియో శస్త్రచికిత్రా శిబిరాలు, కుటుంబ నియంత్రణ శిబిరాలు, హెచ్.ఐ.వీ. రక్తపరీక్షా శిబిరాలు నిర్వహించటంలో ప్రధానపాత్ర పోషించాడు. అయితే ఇప్పుడంటే శృంగారం గురించి ఇంటర్నెట్ లో సమాచారం దొరుకుతుంది కానీ.. ఫోన్లు లేని సమయంలో డాక్టర్ సమరమే అందరి డౌట్లు తీర్చేవాడు.
అయన స్ఫూర్తితోనే ఇప్పుడు ఎంతోమంది సెక్సాలజిస్ట్ వృత్తిని తీసుకున్నారు. అయితే డాక్టర్ సమరం శృంగారం గురించి కేవలం ఇలా చెప్పడమే కాదు అయన దాదాపు మూడు దశాబ్దాలు కేవలం రెండు అంటే రెండే రూపాయిల ఫీజు తీసుకొని వైద్యం చేసేవాడు.. అలా వైద్యం చేసి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయనపై ఎన్ని రకాలుగా దాడులు జరిగినా ఏ మాత్రం తగ్గకుండా మూఢనమ్మకాలపై యుద్ధం చేస్తున్న సంఘ సేవకుడిగా డాక్టర్ సమరం సేవలు అందిస్తున్నారు.
80 ఏళ్ల వయసులోనూ రోజుకు 18 గంటలు పని చేస్తూ నిత్య యవ్వనుడిగా తెలుగు ప్రజలకు ఇప్పటికీ ఎన్నో సందేహాలు తీరుస్తున్నారు డాక్టర్ సమరం.. అలాంటి ఈ డాక్టర్ సమరం ఓ సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఆల్మోస్ట్ అన్నీ సీన్లు శృంగారంకు సంబందించిన సీన్లే.. ఆ సినిమాలో కూడా డాక్టర్ సమరం అయన పాత్రనే పోషించారు.. ఆ సినిమా ఏదో కాదు మీకోసం సినిమా. మీకోసం సినిమాలో ఆల్మోస్ట్ అన్నీ కూడా శృంగారం సీన్లే ఎక్కువ.. అప్పట్లో ఈ సినిమా టికెట్లు ఓ రేంజ్ లో అమ్ముడుపోయాయి… అప్పటి ట్రెండు ఈ సినిమా… మరీ డాక్టర్ సమరం నటించిన ఈ సినిమాను మీరు చూశారా? చూడకపోతే మీకోసం సినిమా యూట్యూబ్ లో ఉంది చూసేయండి.