గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. జగన్ తోపాటు వైఎస్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అభిషేక్‌రెడ్డి విశాఖపట్నంలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. అయితే వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మంగళవారం రాత్రి వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు హాస్పిటల్ వర్గాలు, కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన మరణించినట్లు తెలుస్తోంది. అభిషేక్ రెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో వైఎస్ అభిషేక్ రెడ్డి తుది శ్వాస విడిచారని విశ్వాసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థీవ దేహాన్ని పులివెందులకు తీసుకువెళ్లొచ్చని తెలుస్తోంది.
వైఎస్ జగన్ కూడా పులివెందుకు వెళాతరని నివేదికలు పేర్కొంటున్నాయి. వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు. అభిషేక్ రెడ్డి వైద్యవృత్తిలోనే ఉండే వారు. పార్టీ కోసం కూడా పని చేశారు. అభిషేక్ రెడ్డి వైఎస్సార్‌సీపీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. అలాగే పులివెందుల నియోజకవర్గం లింగాల మండల వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. కాగా గతేడాది సెప్టెంబర్‌లోనే అభిషేక్ రెడ్డి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు.