శృతిమించిన అందాల జాతర చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న శ్రీయ.. వీలు కుదిరిన ప్రతిసారి తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ కూడా వదులుతోంది. డిఫరెంట్ టైపు మోడ్రన్ డ్రెస్సులేసి అందాల ఆరబోతలో తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అయితే టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అంటే యూత్ క్రష్ అని అంటారు. ఈమె కోసం థియేటర్లలోకి యూత్ వెళ్ళేవారంటే అర్థం చేసుకోవచ్చు పాపకు క్రేజ్ ఎంత ఎక్కువ ఉందొ.. అయితే ఈ అమ్మడు తో సినిమా అనుకోని అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ బుక్ చేసుకున్న ఓ ప్రముఖ నిర్మాత ఆ తర్వాత సినిమా చెయ్యలేదట. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఏం అనలేదట దాంతో సినిమా చెయ్యలేదట. ఈ మూవీని పక్కనపెట్టి వేరే సినిమాలతో బిజీ అయ్యింది.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆ నిర్మాత అసలు విషయాన్ని బయట పెట్టాడు. దాంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరో కాదు బెల్లంకొండా సురేష్.. అవును ఇది నిజం. ఆయనే స్వయంగా ఈ మూవీ గురించి బయటకు వచ్చింది. తెలుగు నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇటీవల నిర్మాణ రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకొన్నారు.. ఈ సందర్బంగా ఆయన ఓ ఇంటర్యూలో పాల్గొని తన సినీ కేరీర్ లో ఆయన ఎదుర్కొన్ని పరిస్థితుల గురించి పంచుకున్నారు. ఆయన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్లకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
శ్రీయ ఓ సినిమా కోసం డేట్స్ అడిగితే ఇవ్వనని చెప్పారు. అయితే ఆమెను ఓ చిన్న అబద్దం ఆడి ఆమె డేట్స్ సంపాదించానని చెప్పారు.. ఓ సినిమా కోసం శ్రీయను నేను డేట్స్ అడిగాను. తరుణ్ హీరోగా సినిమా చేస్తన్నామని చెప్పాను. అయితే ఆమె నటించడానికి ఒప్పుకోలేదు. అయితే నేను ఆమెను వదిలిపెట్టలేదు. వెంటపడి డేట్స్ కావాలని అడిగాను. అయితే కథ చెబుతాను. మీకు నచ్చితేనే చేయండని సలహా ఇచ్చాను. దాంతో ఆమె సరేనని చెప్పింది. నేను కథ చెప్పింది వాళ్ళ అమ్మకు.. కథ బాగుంది నేను సినిమా చేస్తానని ఒప్పకొన్నది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి డేట్స్ తీసుకొన్నాను. ఇందులో ట్విస్టు ఏమిటంటే.. నేను తీయబోయేది తరుణ్ సినిమా. కానీ ఆమెకు ఆది మూవీ స్టోరీ చెప్పానని అన్నారు.
ఆమె ఒప్పుకోవడం తో అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ బుక్ చేసుకున్నాను కానీ ఆ మూవీని తియ్యలేదు శ్రీయ అడగలేదు అని ఇన్నాళ్లకు శ్రీయకు చేసిన మోసాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ఈయన నిర్మించిన సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. సుమారుగా 38 సినిమాలను నిర్మించానని ఆయన అన్నారు. అలాగే హీరోయిన్లకు రెమ్యూనరేషన్ పెంచింది కూడా ఈయనే.. సమంత 50 లక్షలు తీసుకొంటే.. నేను ఏకంగా నా సినిమా డేట్స్ ఇచ్చినందుకు 1 కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చాను. అలాగే చాలా మంది హీరోయిన్లకు తమకు వచ్చే దాని కంటే ఎక్కువగానే ఇచ్చి సినిమాల్లో నటింప చేశాను అని ఆయన అన్నారు.. ఇక ప్రస్తుతం తన కొడుకు సినిమాలను నిర్మిస్తున్నాడు. శ్రీయ తెలుగులో అమావాస్య ఒక సినిమాలో మెరిస్తుంది.