జబర్దస్త్ నటి రీతు చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ భామ మొదట సీరియల్స్ లలో నటించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత ఈ ఫేమ్ తో జబర్దస్త్ కామెడీ షోలో ఎంట్రీ ఇచ్చింది. తన కామెడీ టైమింగ్, పంచ్ లతో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది రీతూ చౌదరి. అయితే జబర్దస్త్ నటి రీతూ చౌదరి అలియాస్ వంగ దివ్య.. ఈ పేరు మీడియాను షేక్ చేస్తుంది. ఏపీలో 700 కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్ లో ఈమె పేరు బయటకు వచ్చింది. చీమకుర్తి శ్రీకాంత్ కు ఈమెకు నిజంగానే సంబంధం ఉందా? వీరిద్దరికి నిజంగానే పెళ్లయిందా అనే దానికి పై క్లారిటీ ఇచ్చింది రీతూ.
తాజాగా ఓ ఛానెల్ ఇంటర్యూలో పాల్గొన్న ఈమె అసలు నిజాలను బయట పెట్టి అందరికి షాక్ ఇచ్చింది. మీడియా మాట్లాడుతూ.. మీకు నిజంగానే పెళ్లయిందా అంటే ఒకసారి అయ్యింది. కానీ ఆయన ప్రవర్తన నాకు నచ్చలేదు. అందుకే అతనికి దూరంగా వచ్చేసాను నాలుగు నెలలు మాత్రమే మేము కలిసి ఉన్నాము. ఆ తర్వాత విడిపోయాము. విడాకులు గురించి కోర్టులో కేసు నడుస్తుంది అని చెప్పింది. నాకు తెలియకుండానే సంతకాలు తీసుకున్నారు. ఎంత ఉందో కూడా తెలియదని చెప్పారు.
శ్రీకాంత్ ను నమ్మి నేను గుడ్డిగా నమ్మాను మోసపోయాను నన్ను ఈ స్కామ్ లోకి లాగకండి ఇంతకు మించి ఏమి చెప్పలేను అని చెప్పింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈమె మొదట సీరియల్స్ లలో నటించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత ఈ ఫేమ్ తో జబర్దస్త్ కామెడీ షోలో ఎంట్రీ ఇచ్చింది. తన కామెడీ టైమింగ్, పంచ్ లతో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ షో’, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి షోల్లో కూడా పనిచేసింది. దీంతో మరింత ఫేమ్ సొంతం చేసుకుంది.
తాజాగా ఈమె ‘వేరే లెవల్ ఆఫీస్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నో విషయాలను పంచుకుంది. ప్రస్తుతం తాను షోలు, వెబ్ సిరీస్‌లతో పాటు బిజినెస్ కూడా చేస్తున్నాననీ, తనకు రీసెంట్గా రెండు సినిమా ఛాన్స్‌లు వచ్చాయనీ తెలిపింది.