త్రివిక్రమ్‌ నా జీవితాన్ని నాశనం చేశాడు అంటూ.. సంచలన విషయాలు చెప్పిన పూనమ్ కౌర్.

divyaamedia@gmail.com
2 Min Read

పూనమ్ కౌర్..హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌లపై అవకాశం చిక్కినప్పుడల్లా తన అక్కస్సును వెళ్లగక్కుతుంటుంది ఈ భామ. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్, త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటుంది. గతంలో పలుమార్లు త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ అనేకమార్లు పోస్టులు పెట్టడం జరిగింది. అయితే తాజాగా పూన‌మ్ కౌర్ మ‌రో సంచ‌ల‌న ట్వీట్ చేశారు. డైరెక్ట‌ర్‌ త్రివిక్ర‌మ్‌పై చాలా కాలంగా మా అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎవ‌రూ యాక్షన్ తీసుకోలేదని ట్వీట్ చేసింది.

అంతే కాదు.. త్రివిక్ర‌మ్ త‌న జీవితాన్ని అన్ని విధాలుగా నాశ‌నం చేశాడ‌ని.. అలాంటి వ్య‌క్తిని ఇండ‌స్ట్రీలో కొంతమంతి పెద్ద‌లు ఎంక‌రేజ్ చేస్తున్నార‌ని పూన‌మ్ ఆరోపించారు. ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ‌రోవైపు.. పూనమ్ కౌర్ ట్వీట్‌పై మా అసోసియేషన్ స్పందించింది. మా కోశాధికారి శివ బాలాజీ ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు. పూనమ్ కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి ఎలాంటి ఫిర్యాదు రాలేద‌ని, మా టర్మ్ కంటే ముందే ఆమె ఫిర్యాదు చేసినట్టు కూడా రికార్డుల్లో ఎక్కడా లేద‌ని అన్నారు.

మా అసోసియేష‌న్‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు పూనమ్ కౌర్ ఇలా ట్వీట్ చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ఉపయోగం లేద‌ని, మా అసోసియేషన్‌ను గాని, న్యాయ వ్యవస్థను గాని ఆమె ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుంద‌ని.. శివ బాలాజీ కామెంట్‌ చేశారు. పూన‌మ్ కౌర్ త్రివిక్ర‌మ్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఇదేం కొత్త కాదు. గ‌త కొంత కాలంగా వీరి మ‌ధ్య ఏదో ఇష్యూ న‌డుస్తూనే ఉంది. ఐతే, త్రివిక్ర‌మ్ ఏ రోజు కూడా పూన‌మ్ గురించి మాట్లాడ‌డం గాని, ఈ ఇష్యూ గురించి వివ‌ర‌ణ ఇవ్వ‌డం లాంటివి చేయ‌లేదు. ఐతే, పూన‌మ్ కౌర్ మాత్రం ఎప్పుడు అవ‌కాశం దొరికినా..

అటు త్రివిక్ర‌మ్‌ను, ఇటు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు పూన‌మ్‌. ఏపీలో ఎన్డీఏ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సంద‌ర్భంగా కూడా ఆమె వివాదాస్ప‌ద ట్వీట్ చేశారు. “మోసం చేసి చీటర్‌గా గెలవడం కంటే విలువలు, నిజాయతీ ఉన్న యోధుడిగా ఓడిపోవడమే మేలు.. అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఇక్క‌డ మాజీ సీఎం జ‌గ‌న్‌ని నిజాయ‌తీ ఉన్న యోధుడిగా.. ప‌వ‌న్ క‌ళ్యాన్‌ను చీట‌ర్‌గా అభివ‌ర్ణిస్తూ ట్వీట్ చేసిన‌ట్టు క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *