అరుంధతి సినిమా ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ అయినా మంచి పేరు కలెక్షన్లు సాధించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా దివ్య నగేష్ యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే ఆ నటనకు ఆమెకు నంది అవార్డు కూడా దక్కింది. అయితే ప్రస్తుతం దివ్యా నరేష్ ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే తాజాగా ఆమె నిశ్చితార్థం తన సహ నటుడు, కొరియోగ్రాఫర్ అజి కుమార్‌తో గ్రాండ్ గా జరిగింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం దివ్య, అజి కుమార్ ల నిశ్చితార్థం ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయ జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా దివ్య, అజి కుమార లు చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని మూడు ముళ్ల బంధంగా మార్చుకునేందుకు రెడీ అయ్యారు.
![](https://darsilivetv.com/wp-content/uploads/2025/01/465645132-1024x572.png)
తనకు కష్టకాలంలో ఎంతో అండగా నిలిచిన అజి, ఇప్పుడు తన జీవిత భాగస్వామి కాబోతుండడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది దివ్య నగేశ్. కాగా త్వరలోనే దివ్య, అజి కుమార్ ల వివాహం జరగనుందని తెలుస్తోంది. కాగా అరుంధతి తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది దివ్య. అయితే పెద్దగా సక్సెస్ రాలేదు.