కీర్తి సురేశ్.. తెలుగు, తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది. ఇటీవలే తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్ ను కీర్తి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బేబీ జాన్ సినిమా సమయంలో కీర్తి వరుసగా బాలీవుడ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ఆంటోనీని నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు కలిసాను.
అతను నాకంటే ఏడేళ్లు పెద్ద. అతను ఖతార్ లో వర్క్ చేసేవాడు. మేము ఆరేళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో ఉన్నాము. కరోనా సమయంలో మేము లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాం. మేమిద్దరం కరోనా సమయంలో కలిసి ఒకే ఇంట్లో ఉన్నాము అని తెలిపింది. అంటోన్ తట్టిల్ ఓ వ్యాపారవేత్త. అతనికి తమిళనాడుతో పాటు అరబ్ కంట్రీస్ లో వ్యాపారాలు ఉన్నాయి. 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు లివ్ ఇన్ రిలేషన్ లో ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు.
హిందూ, క్రిస్టియన్ రెండు సాంప్రదాయాల్లోను వీరు గోవాలో పెళ్లి చేసుకున్నారు. తాజాగా కీర్తి తన భర్త తనకంటే ఏడేళ్లు పెద్ద అని చెప్పడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇంటర్ చదివేటప్పటి నుంచే అతనితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వెళ్ళింది అంటే గ్రేట్ అనే అంటున్నారు. ప్రస్తుతం కీర్తి చేతిలో రెండు తమిళ్ సినిమాలు ఉన్నాయి. ఇవి పెళ్ళికి ముందు ఒప్పుకున్నవే. మరి పెళ్లి తర్వాత సినిమాలు రెగ్యులర్ గా చేస్తుందా లేదా చూడాలి.