శుక్రవారం రోజు మీ ఇంట్లో లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే చాలు, జీవితంలో డబ్బుకు కొరత ఉండదు.

divyaamedia@gmail.com
2 Min Read

ఆరు విశేష గుణాలకు దేవత లక్ష్మి. విష్ణువు శక్తికి మూలాధారం కూడా ఆమెనే. విష్ణువు, రాముడు, కృష్ణునిగా అవతరించినప్పుడు.. లక్ష్మీదేవి, సీత, రాధగా వారి భార్య అవుతుంది. కృష్ణుడి భార్య కూడా లక్ష్మీ అవతారంగా భావిస్తారు. లక్ష్మి ఉన్న ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్మకం. అయితే శుక్రవారాల్లో లక్ష్మీపూజ చేయడం, ఉపవాసం పాటించడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వలన ఆర్ధిక సమస్యల నుంచి బయటపడవచ్చని శాస్త్రాలు పేర్కొన్నాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు తో పాటు సిరి సంపదలు లభిస్తాయి. స్త్రీ, పురుషులు ఇద్దరూ శుక్రవారం ఉపవాసం చేయవచ్చు.

ఇలా చేయడం వలన భౌతిక ఆనందాన్ని ఇస్తుంది. తామర పువ్వుతో పూజ:- సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవిని శుక్రవారాల్లో ఆచారాలతో పూజించాలి. లక్ష్మీ దేవిని పూజించే సమయంలో ఆమెకు తామర పువ్వు సమర్పించాలి. ఎర్ర గులాబీ, మందారం పువ్వులతో పూజ చేయడం శుభప్రదం. లక్ష్మీదేవి సంతృప్తి చెంది.. అమ్మవారి ఆశీర్వాదాలను వర్షంలా కురిపిస్తుంది. ఎవరైనా జీవితంలోని డబ్బు సమస్యల నుంచి విముక్తి పొందాలనుకుంటే.. లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా తామర పువ్వును సమర్పించండి. ఇలా చేయడం ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది. డబ్బు సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది.

బియ్యం పరమాన్నం:- లక్ష్మీ దేవిని శుక్రవారం రోజున పూజించే సమయంలో బియ్యంతో పాయసం సిద్ధం చేయండి. పంచదారకు బదులు బెల్లం కలిపి చేసుకోవాలి. తర్వాత లక్ష్మీదేవికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు , ఆరోగ్యం చేకూరుతుంది. ఈ పాయస నైవేద్యాన్ని లక్ష్మీ దేవికి సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక లాభం పొందవచ్చు. శ్రీ యంత్రం:- ఎవరైనా ఆర్థికపరమైన అవరోధాల వల్ల ఇబ్బంది పడుతుంటే.. వాటి నుంచి బయటపడాలంటే శుక్రవారం రోజున ఇంట్లో శ్రీ యంత్రాన్ని ప్రతిష్టించండి. ఇంటిలోని దేవుని గదికి ఉత్తరం వైపు లేదా ప్రధాన ద్వారంలో అమర్చాలి.

ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు. శంఖం:- పురాణ శాస్త్రాల ప్రకారం ఇంట్లో శంఖాన్ని రోజూ ఊదడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇంట్లో శంఖాన్ని ఊదాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. వైభవ లక్ష్మీ వ్రతం:- ఎవరైనా పెళ్లికాని యువతీ యువకులు తాము కోరుకున్న వధువు లేదా వరుడు పొందాలనుకుంటే.. శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేసి ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తన భక్తులు కోరిన కోరికలన్నిటినీ తీరుస్తుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *