ఇంటింటి గృహాలక్ష్మి’ సీరియల్ ద్వారా తులసిగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సీరియల్ తో కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఆమె నటి గానే కాకుండా.. అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ సేవలందిస్తున్నారు. అయితే ఈమెకు ఫ్యాషన్ గా ఉండాలంటే ఇష్టం. దాంతో మొదట మోడల్ గా ఎంట్రీ ఇచ్చింది. అలా 1991లో మిస్ చెన్నైగా గెలుపొందారు. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా సెలక్ట్ అయ్యారు.
ఈ ఫేమ్ తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తన అందం, అభినయంతో వరుస అవకాశాలను అందుకుంటూ.. వరుస విజయాలు అందుకుంది.. ఆ తర్వాత ఇండస్ట్రీలో బాలయ్య, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. అయితే ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. అందులో ఆమె తన సీక్రెట్ ను రివిల్ చేసింది.. రాత్రి 9 దాటితే కస్తూరి గారికి ఉవ్విల్లూరుతాయి. ఆ కోరికను వద్దు అని తనకు తాను చెప్పుకున్న కూడా చెయ్యకుండా ఆగలేకపోతుందట..
అప్పుడప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి తాను లొంగిపోతున్నా.. కొన్నిసార్లు తెల్లారి అది తలుచుకుని గిల్టీగా ఫీల్స్ అవుతున్నా.. మరోసారి దాన్ని జోలికి వెళ్లొద్దని భావిస్తాను కానీ ఆ కోరికను తీర్చుకోకుండా ఉండలేకున్నా అని చెప్పింది. ఆ కోరిక ఏంటో కాదు తొమ్మిది దాటితో ఆలు చిప్స్ తినాలని అనిపిస్తుందట.. అనుకోవడం తినడం అయ్యాక ఉదయం లేచి ఎందుకు తిన్నా అని ఫీల్ అవుతుందట.. ఈ కోరిక విన్న నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ వింత కోరికతో మరోసారి వార్తల్లో హైలెట్ అయ్యింది.