గత కొన్ని సంవత్సరాలుగా రజనీకాంత్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి. ”జైలర్”ను మినయిస్తే.. మిగిలిన సినిమాలు ఆశించిన విధంగా ఆకట్టుకోలేకపోతున్నాయి. కబాలి, కలా, దర్బార్, పెద్దన్న వంటి సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచాయి. అయితే తలైవా రజనీకాంత్ సినిమా వస్తుందంటే చిన్న సినిమాలు రిలిజ్ను పోస్ట్‌పోన్ కూడా చేసుకుంటాయి. ఏడు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా దూసుకుపోతున్నారు రజనీకాంత్.
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్ 5లో నిలుస్తున్నారు రజనీకాంత. ఇక రజనీకాంత్ సరసన బిడ్డగా, లవర్, మరదలు, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్ ఒక్కరే ఉన్నారు. రజనీకాంత్ సరసన అన్ని పాత్రల్లో నటించిన ఆమె ఎవరో కాదు నటి మీనా. మీనా చైల్డ్ ఆర్టిస్ట్‌గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మీనా చైల్డ్ ఆర్టిస్ట్‌గా 1982లో వచ్చిన తమిళ్ సినిమా ‘నెంజంగల్’లో నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘ఎంకెయో కెట్టా కురల్’, ‘అన్బుల్లా’ వంటి తమిళ సినిమాల్లోనూ మీనా నటించింది.
చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకుంది. మీనా ఎంగెయాకెట్ట కరుల్’ సినిమాలో రజనీకాంత్‌కు బిడ్డ పాత్ర పోషించింది. ఆ తర్వాత వచ్చిన వీర, యజమాన్, ముత్తు చిత్రాల్లో లవర్, మరదలు, భార్య పాత్రల్లో కనిపించింది. ఇలా రజినీకాంత్‌తో పలు సినిమాల్లో నటించింది. 24 ఏళ్ల తర్వాత మరోసారి ఈ హిట్ జోడీ మళ్లి కలిసి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో మీనాని ప్రశ్నించగా దీనిపై ఆమె మాట్లాడలేదు.
ఇక మీనా విషయానికి వస్తే ఇటీవల మీనా భర్త చనిపోయారు. నటి మీనా. మీనాకు ఒక కూతురు నైనిక ఉంది. ఈ చిన్నారి కూడా తళపతి విజయ్ సినిమాలో నటించింది. మలయాళంలో వచ్చిన దృశ్యం సినిమాతో సినీ ఇండస్ట్రీలో మీనా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ సినిమాలో మీనా తల్లి పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.