జానీ మాస్టర్ కేసులో నార్సింగి పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేసారు. ఈవెంట్ పేర్లతో పలు ప్రాంతాలకు ఆ లేడీ కొరియోగ్రాఫర్ ను తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల నిర్ధారణకు వచ్చారు. దీంతో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. త్వరలోనే జానీ మాస్టర్ ని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు కావడంతో తాత్కాలికంగా బయటకు వచ్చారు.
కొద్దికాలం విశ్రాంతి తీసుకున్న జానీ మాస్టర్ మళ్లీ తన వృత్తిలో బిజీగా మారారు. అయితే, తాజాగా పోలీసులు మరోసారి ఆయనపై చర్యలు చేపట్టారు. లైంగిక వేధింపుల కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా, తాజాగా పోలీసులు మరో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. అందులో, ఓ లేడీ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈవెంట్స్ పేరుతో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లిన సందర్భాల్లో, యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తాజా ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ కేసులో అంతా ముగిసిపోయిందని అనుకున్న సమయంలో, మరోసారి పోలీసుల ఈ చర్య జానీ మాస్టర్‌కు ఊహించని ఎదురుదెబ్బగా మారింది. జానీ మాస్టర్ కూడా బుధవారం కిమ్స్ ఆస్పత్రికి వచ్చి శ్రీ తేజ్‌ను పరామర్శించారు.
ఆయన మాట్లాడుతూ, “శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. కొరియోగ్రాఫర్స్ సొసైటీ తరఫున ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తాం. శ్రీ తేజ్‌ను చూడాలనే ఆత్రుత అందరిలో ఉంది, కానీ కొన్ని పరిమితుల వల్ల వెంటనే కుదరడం లేదు,” అన్నారు. జానీ మాస్టర్ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు.