అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుందా..? పోలీసులు ఏం చేయబోతున్నారో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బన్నీ అరెస్ట్..బెయి కి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. బన్నీ ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. అయితే ఆ తరువాత సంధ్య ధియేటర్ లో జరిగిన మినిట్ టూ మినిట్ వీడియో రిలీజ్ చేశారు. అయితే హైకోర్టు బెయిల్ ఇస్తూ.. కొన్ని కండీషన్లు పెట్టింది. కానీ అల్లు అర్జున్ ఆ కండీషన్స్ అమలు చెయ్యకుండా.. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారనీ, మళ్లీ మళ్లీ ప్రెస్‌మీట్లు పెడుతున్నారని పోలీసులు ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ఇలా ప్రెస్‌మీట్ పెట్టిన విషయం పెద్ద దుమారం రేపుతోంది.

ఇది బెయిల్ రూల్స్‌కి విరుద్ధమే అంటున్నారు పోలీసులు. అల్లు అర్జున్ డిసెంబర్ 21న రాత్రి 8 గంటలకు తన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి.. సంధ్య థియేటర్‌లో తాను సినిమా చూసేటప్పుడు.. తన దగ్గరకు ఏ పోలీసులూ రాలేదని అన్నారు. కానీ ఆయన చెప్పింది అబద్ధం అని నిరూపిస్తూ.. పోలీసులు ఓ వీడియో సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. ఇలా పోలీసులకు వ్యతిరేకంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ అబద్ధం చెప్పడం ఆయనకు చిక్కులు తెస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

కానీ తన దగ్గరకు పోలీసులు రాలేదని అల్లు అర్జున్ చెప్పిన మాట.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అవమానించడమే కాదు.. పోలీసులనూ అవమానపరిచినట్లైందనే టాక్ వినిపిస్తోంది. అలాగే మీడియానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలనూ తప్పుదారి పట్టించినట్లైందని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాదు.. డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌కి రావొద్దని పోలీసులు చెబితే.. అల్లు అర్జున్ వెళ్లారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు వీడియోలో లిఖితపూర్వక రుజువులతో సహా నిరూపించారు. ఇలా అల్లు అర్జున్ అన్ని రకాలుగా దొరికిపోయారు. బెయిల్ వచ్చినప్పుడు.. కేసుకి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలూ చెయ్యకూడదు.

అది రూల్. కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి.. తెలుగు, ఇంగ్లీష్‌లో మొత్తం కేసు గురించే మాట్లాడారు. ఇది చట్ట విరుద్ధం అని పోలీసులు భావిస్తున్నారు. న్యాయ నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. హైకోర్టు షరతులతో బెయిల్ ఇచ్చిందనే విషయం మర్చిపోకూడదు అంటున్నారు. అయితే.. ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడారు. మరి కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు సీఎం కూడా మాట్లాడకూడదు కదా అనేది కొందరి వాదన. ప్రభుత్వంపై నెగెటివ్‌గా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించేందుకే ఆయన మాట్లాడారని కొందరు చెబుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *