హీరోగా విలన్ గా మోహన్ బాబు నటవిశ్వరూపాన్ని చూపించారు.అయితే ఆయన కొన్ని సార్లు నోరు జారడం వల్లనే ఈ ట్రోల్స్ వస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతుంటారు. ఇదిలా ఉంటే మోహన్ బాబు జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అయితే గతవారం నుంచి మాత్రం వీళ్ల మధ్య గొడవలు చల్లారినట్లు కనిపిస్తున్నాయి. ఓ వైపు మంచు విష్ణు, మరోవైపు మంచు మనోజ్.. ఇద్దరు ఆస్తులు కోసం గొడవ పడ్డారనే టాపిక్.. ఒక్క టాలీవుడ్‌ను మాత్రమే కాదు.
యావత్ దక్షిణాది ఇండస్ట్రీలో దుమారం రేపింది. మరోవైపు ఒకరిమీద ఒకరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం.. ఇలా ప్రతీది పెద్ద కలకలం రేపింది. ఇలాంటి పరిస్థితుల్లో.. మంచు విష్ణు, మంచు మనోజ్ ఒక్క తల్లికి పుట్టలేదన్న విషయం సోషల్ మీడియాను షేక్ చేసింది. నిజానికి ఈ విషయం వీళ్ల గొడవల ముందు వరకు కూడా చాలా మందికి తెలియదు. మంచు విష్ణు, మంచు లక్ష్మీ.. మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవికి పుట్టిన వాళ్లు. రెండవ భార్య నిర్మలా దేవికి మనోజ్ ఒక్కడే సంతానం. కాగా, విద్యా దేవి, నిర్మలా దేవి ఇద్దరు సొంత అక్కా చెల్లెల్లు.
అయితే.. మంచు మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి ఎలా చనిపోయిందన్న విషయం చాలా మందికి తెలియదు. కొందరు ఆమె అనారోగ్యంతో చనిపోయారని తెలిపారు. కాగా.. అసలు ఆమె ఫైర్ యాక్సిడెంట్ వల్ల చనిపోయిందట. ఇంట్లో అకాస్మాత్తుగా జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల చనిపోయిందట. ఫైర్ యాక్సిడెంట్ చాలా దారుణంగా జరిగిందని పలువురు తెలిపారు. మంచు మోహన్ బాబు తన భార్య చనిపోవడంతో చాలా రోజులు బాధతోనే ఉన్నాడని, ఆమెను మర్చిపోలేకపోయాడని కూడా తన ఆత్మీయులు చెబుతున్నారు. ఇక.. మోహన్ బాబు రెండో భార్య నిర్మలా దేవి.. ముగ్గురు పిల్లలను సమానంగా చూసేదట.