మరో భయంకరమైన వ్యాధితో భాదపడుతున్న సమంత, ఆమె రోగాల రోగాల చిట్టా తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

సమంత..భారతదేశంలో నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. అటువంటి హీరోయిన్ రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి సినిమా చేయకుండా ఉందంటూ అభిమానులు బాధపడిపోతున్నారు. ఇటీవలే వరుణ్ ధావన్ తో నటించి సిటాడెల్ రీమేక్ సిరీస్ హనీబన్నీ విడుదలై విజయవంతమైంది. అయితే గత 15 ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీని స్టార్ హీరోయిన్ గా ఏలుతోంది… ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ బ్యూటీ తన నటనతో అందంతో ఓ రేంజ్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇక అలాంటి ఈ బ్యూటీ మొదట్లో సిద్దార్థ్ తో ప్రేమలో పడగా అతనితో కొన్ని కారణాల వల్ల విడిపోయింది.

అప్పట్లో అతనితో ప్రేమలో ఉన్నట్టు.. శ్రీకాళహస్తిలో పూజలు కూడా చేసినట్టు వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇక అలాంటి ఈ బ్యూటీ అక్కినేని వారసుడు నాగ చైతన్యను ప్రేమించి 2017లో పెళ్లి చేసుకుంది.. అయితే ఇక్కడ కూడా నాలుగేళ్లకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరు విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల తర్వాత సమంతకు ఎంతో నెగిటివిటి వచ్చింది.. ఆమె నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడం చాలా ఫులిష్ నిర్ణయం అంటూ కొందరు ట్రోల్ చేస్తే మరికొందరు నీ జీవితం అంతా ఒంటరితనమే అంటూ కామెంట్లు చేశారు.

ఆతర్వాత దాదాపు ఏళ్లపాటు సమంత అనారోగ్యంతో బాధపడింది.. మయోసైటీస్ వ్యాధి వల్ల సమంత దాదాపు ఇండస్ట్రీకి ఏడాది పాటు దూరం అయ్యింది. అంత బాధలోనూ సమంత సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనింది. అయితే సమంత ఆ ప్రమోషన్స్ సమయంలో కన్నీళ్లు పెట్టుకుంది.. అలా ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యింది.. ఆమె ఫ్యాన్స్ అయితే అక్కినేని కుటుంబంపై దారుణమైన ట్రోల్స్ చేశారు.. సమంత కన్నీళ్లకు కారణం అక్కినేని కుటుంబమే అని… నాగచైతన్య విడాకులు.

ఆమె అనారోగ్యం వల్ల అన్ని సమస్యలు ఒకేసారి వచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకున్నట్టు నెట్టింట్లో వార్తలు వైరల్ అయ్యాయి.. అయితే ఆతర్వాత నుంచి కూడా ఆమె చాలా సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించారు.. ఇక అదే విషయాన్నీ ఓ యాంకర్ ఆమెను నేరుగా అడిగేశాడు.. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను యాంకర్ ఇలా ప్రశ్నించాడు. మీరు ప్రతి చిన్నదానికి ఏడుస్తారా? ఈ మధ్యకాలంలో ఏడుస్తూ ఎక్కువగా కనిపిస్తున్నారు.. కారణం ఏంటి అని అడిగితే అందుకు సమంత ఇలా స్పందించారు. ఈ ప్రశ్న నన్ను అడిగి మంచిపని చేశారు.

నేను మాటకు ఏడుస్తా అని అనుకుంటారు కానీ నా ఏడుపుకి కారణం నాకు కళ్ళల్లో లైట్ పడితే కన్నీళ్లు వస్తాయి. నాకు లైట్ సెన్సిటివిటీ ఉంది. ఎక్కువ లైట్ నా కళ్ళల్లో పడితే కన్నీళ్లు వస్తాయి. కానీ ఇది తెలియని ప్రతిఒక్కరు నేను సెన్సిటివి అనుకుంటారు.. నేను ఎప్పుడు నా వ్యక్తిగత కారణాల వల్ల ఏడవను అని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సమంత మరో భయంకరమైన వ్యాధి వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *