వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తన పట్టును పెంచుకునే సమయం ఇది. వైరస్‌లు.. మన శరీర నిర్మాణంలోని కణాలలోకి వెళ్లి, వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి. కొత్త కరోనావైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు. అయితే మొన్నటికీ మొన్న కరోనా వైరస్ కూడా అంతే ప్రాణాంతకంగా మారింది.. ఇది మిలియన్ల మంది ప్రజలను మృత్యుఒడిలోకి నెట్టింది. దాదాపు మొత్తం ప్రపంచాన్ని వణికించింది.
అయినప్పటికీ, ఈ ప్రాణాంతక వ్యాధులపై డేంజర్ బెల్స్ ఆగటం లేదు. ఇప్పుడు WHO భవిష్యత్తులో మరో పేరులేని ప్రాణాంతక వ్యాధి ప్రజల్ని వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ‘X’ వ్యాధిగా చెబుతున్న ఈ వ్యాధిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. దీన్ని నివారించేందుకు ప్రపంచం మొత్తం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని WHO హెచ్చరించింది. ‘X’ వ్యాధి గురించిన భయంకరమైన విషయం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించింది.
ఈ పేరులేని అంటువ్యాధి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి ఏ రూపంలోనైనా దాడి చేయగలదని WHO హెచ్చరిస్తోంది. ఈ దాడి ఎవరిపై ఎక్కడ మొదలవుతుందో వైద్య శాస్త్రానికి కూడా తెలియదని ఆందోళన వ్యక్తం చేసింది. అందరూ ప్రజలంతా సరైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని చెబుతున్నారు. ఆధునిక ఆహారపు అలవాట్లను తగ్గించి మేలైన పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.