యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, వెలుగులోకి షాకింగ్ విషయాలు. షాక్ లో అభిమానులు.

divyaamedia@gmail.com
1 Min Read

ప్రసాద్ బెహరా..కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ప్రసాద్ బెహరాను రిమాండ్ కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. బాధితురాలు ప్రసాద్ బెహరాతో కలిసి వెబ్ సిరీస్ ల్లో నటించింది. గుర్తింపు వస్తున్న టైమ్ లోనే చాలామంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు.

అవి ఫాస్ట్ గా వెళుతున్న వారి కెరియర్ కి బ్రేకులు వేస్తాయి. ఇదివరకే చాలా మంది యూట్యూబర్స్ లైంగిక వేధింపులు కేసులో జైలు పాలు అయ్యారు. ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ కూడా అరెస్ట్ అయ్యాడు. సహచర నటిని వేధించిన కేసులో బెహరా ప్రసాద్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రసాద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ సమయంలో ప్రసాద్‌ తనకు పరిచయమయ్యాడని యువతి చెబుతోంది.

షూట్‌లో భాగంగా అసభ్యంగా ప్రవర్తించాడని.. నిలదీయడంతో క్షమాపణలు చెప్పాడంటోంది. ఈ నెల11న షూటింగ్‌ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్‌ అందరి ముందు తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్‌ను కోర్టులో హాజరుపర్చగా .. 14 రోజుల రిమాండ్‌ విధించారు. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా రీసెంట్ గా కమిటీ కుర్రాళ్ళు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలాంటి టైంలో ఇలా అరెస్ట్‌ కావడం అనేది ప్రసాద్ కెరియర్‌కి ఒక చెరిగిపోని మచ్చ అని చెబుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *