నటి సీత, రజినీకాంత్, విజయకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తుంది. తన ఇంట్లో రెండున్నర సవరన్ల నగలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీనియర్ నటి ఇంట్లో రెండున్నర సవరన్ల బంగారు నగలు పోయాయి అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తమిళ సినిమాలలో ఆణ్బావం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సీనియర్ నటి సీత రజనీకాంత్, విజయ్ కాంత్ అంటే స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి, భారీ పాపులారిటీ అందుకుంది. ఇకపోతే వయసు పెరిగే కొద్దీ హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ్, తెలుగు చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా పార్థిబన్ తో విడాకులు తర్వాత సీరియల్ నటుడు సతీష్ ను రెండవ వివాహం చేసుకున్న ఈమె.. ఆఖరికి అతడి నుంచి కూడా విడిపోయింది. ప్రస్తుతం విరుగంబాక్కంలోని పుష్ప కాలనీలో నివసిస్తోంది.
అయితే ఇప్పుడు తన ఇంట్లో రెండున్నర సవరన్ల జిమ్కి పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిందట. మిగతా నగలు ఉండడంతో.. తనకు తెలిసిన వాళ్ళు ఎవరో దొంగలించి ఉంటారని సీత అనుమానాలు వ్యక్తం చేస్తుండగా..విరుగంబాక్కం పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిసింది. ఇకపోతే జయం రవి హీరోగా నటించిన ‘బ్రదర్ ‘సినిమాలో నటించింది. తమిళం తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. అలాగే సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇకపోతే ఈమె నటి మాత్రమే కాదు నిర్మాత కూడా.. 1985 నుండి 1990 వరకు హీరోయిన్గా కొనసాగిన ఈమె ‘ఆడదే ఆధారం’ చిత్రంతో నంది అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత 2002లో వచ్చిన ‘మారన్’ అనే తమిళ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి 2004లో తమిళ సినిమా ‘రైటా తప్పా’ అనే సినిమాతో తమిళనాడు రాష్ట్రం ఉత్తమ సహాయ నటి పురస్కారం అందుకుంది.