Actress Rashmi ఇండస్ట్రీలో ఉన్న స్టార్ యాంకర్లలో రష్మి గౌతమ్ పేరు ముందే ఉంటుంది.ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు పలు సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదండోయ్.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ ఉంటుంది.ఇక దశాబ్ద కాలంపాటు ఇండస్ట్రీలో రానిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది రష్మి. అయితే అప్పుడప్పుడు ఈమెకు సంబంధించిన కొన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా రష్మి పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతూ ఉంటుంది.
జబర్దస్ షోలో కమెడియన్ సుధీర్‌తో.. రష్మి ప్రేమాయణం సాగిస్తుందని ఆ మధ్య జోరుగా వార్తలు సాగాయి. అంతేకాకుండా సుధీర్‌నే ఆమె పెళ్లి చేసుకోబోతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఈ జంట చాలా సార్లు మాట్లాడారు. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని.. తమ మధ్య ఇంకెలాంటి సంబంధం లేదని ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా ఏదో ఒక చోట వీరికి సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడుకి సంబంధించిన ఓ వార్త బయటకొచ్చి వైరల్‌గా మారింది. రష్మి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా అబ్బాయితో రష్మి పెళ్లి ఫిక్స్ అయిందని.. ఈ జంట త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ వార్తలు జోరుగా సాగుతున్నాయి.కాగా ఇందుకు సంబంధించి ఇద్దరు జాతకాలను చూపించారని సమాచారం. దీంతో త్వరలోనే రష్మి పెళ్లి పై అధికారిక ప్రకటన వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తెలిసి కొందరు నెటిజన్లు.. ‘రష్మి నువ్వు అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే.. సుధీర్ అన్న ఏమైపోతాడో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.