నాగచైతన్య పెళ్లి సోషల్ మీడియాలో ఇప్పటికే పెళ్లి ఆహ్వాన పత్రిక వైరల్ అవుతూ, వివాహం ఏర్పాట్ల గురించి అనేక వివరాలను బయటపెట్టింది. ఆహ్వాన పత్రికలో శోభిత పేరుకు ముందు “లక్ష్మీ” అనే పేరు ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం. అయితే టాలీవుడ్ హీరో నాగ చైతన్య, ప్రముఖ నటి శోభిత ధూళిపాళత్వరలో పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. 2024 ఆగస్టు 8న రహస్యంగా వీరి నిశ్చితార్థం జరిగింది. వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని ముందే తెలుసంటూ సినీ అభిమానులు రచ్చ చేశారు. సమంతతో విడుకులు తీసుకోని ఏడాది కాకముందే మరొక అమ్మాయితో తిరుగుతున్నాడంటూ పుకార్లు అప్పట్లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
ఇక నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్తో సినీ ప్రేక్షకులు, అభిమానులు ఆశ్చర్యపోయారు. మాములుగా ఒక సెలబ్రెటీకి సంబంధించిన చిన్న ఈవెంట్ అయినా సరే వారం, పది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. అలాంటిది నాగచైతన్య లాంటి స్టార్ నటుడి ఎంగేజ్మెంట్.. నాగార్జున ఫోటోలు పెట్టేసరికి కూడా క్లారిటీ రాలేదంటే, ఎంత సీక్రెట్‌గా నిశ్చితార్థం జరిపారో అర్థం చేసుకోవచ్చు. ఇక వీళ్ల పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ఆల్రెడీ మొదలైపోయాయి. పసుపు దంచడం మొదలైదంటూ ఇప్పటికే శోభిత తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా ఇప్పటికే పంచుకుంది. ఇక తాజాగా పెళ్లి కార్డులు పంచడం కూడా మొదలైపోయినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం వీరి పెళ్లి కార్డు సోషల్ మీడియాను సందడి చేస్తుంది. ఇక వీళ్ల పెళ్లి డిసెంబర్ 4న జరుగనుంది. అయితే పెళ్లి వేడుక ఎక్కడని మాత్రం కార్డులో లేదు. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం అన్నపూర్ణ స్డూడియోస్‌లో ప్రత్యేకించి మండపం సెట్ వేయించారని తెలుస్తుంది. అంతేకాదు పెళ్లి కోసం రూ.50 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు తెలుస్తుంది. మేనల్లుడి పెళ్లికి దగ్గుబాటి కుటుంబం భారీ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ గిఫ్ట్ ఏంటనేది ఇప్పటి వరకూ బయటకు రాలేదు. మేనల్లుడి కోసం.. ఏదో పెద్ద గిఫ్టే ఇవ్వబోతున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్.
అయితే ఈ గిఫ్ట్ వెంకటేశ్ ఇస్తున్నాడని.. అది ఏంటనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు, అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య, శోభిత ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సనిమాతో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది.