AR Rahman | ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్(AR Rahman).. తన భార్య సైరాకు బ్రేకప్ చెప్పేశారు. తమ బంధానికి ముప్పై ఏళ్లు నిండుతుందని ఆశించానని, కానీ ఆ బంధానికి ముందే బ్రేకప్ చెప్పేస్తున్నట్లు ఆయన తెలిపారు.వీరిద్దరు విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన కలహాలు అని.. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ.. తమ మధ్య ఏర్పడిన ఇబ్బందులను అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని లాయర్ వందనా షా పేర్కొన్నారు.
అభిప్రాయబేధాల కారణంగానే ఇద్దరి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమ విడాకుల విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ స్పందించారు.‘మేము సంతోషంగా ముప్పైకి చేరుకోవాలని ఆశించాము. కానీ అన్ని విషయాలు కనిపించని ఒక ముగింపును కలిగి ఉంటాయని తెలిగింది. ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడి సింహాసనం సైతం వణుకుతుంది.
చాలా రోజుల తరువాత మళ్ళీ తల్లి కాబోతున్న సింగర్ సునీత.
అయినా ఈ ముగింపులో మేము మరో అర్థాన్ని వెతుకుతున్నాము. విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా కనిపించవు’ అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. సైరాతో గడిపిన మూడు దశాబ్దాల జీవితాన్ని ముగించడంపై రెహమాన్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితులలో తన స్నేహితులకు, బంధువులు చూపించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపాడు.