‘క’ సినిమాలో చూపించిన ఊరు నిజంగా ఉంది, మన తెలంగాణలోనే.. ఎక్కడంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

తెలంగాణలోని పెద్దపల్లికి 10 కిమీ దూరంలో ఉన్న ఆ గ్రామాన్ని ‘మూడుజాముల కొదురుపాక’ అని పిలుస్తారు. ఈ ఊరిలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 జాములే ఉంటాయి. సాయంత్రం 4 గంటలకే అక్కడ చీకటి అవుతుంది. 4 దిక్కులా ఎత్తైన కొండలు, మధ్యలో ఊరు ఉండటంతో సూర్యుడు కొండల వెనక్కి వెళ్లి ఆ నీడ పడి త్వరగా ఆ గ్రామంలో చీకటి అవుతుంది. అలాగే ఈ గ్రామంలో సూర్యోదయం కూడా కాస్త ఆలస్యంగా జరుగుతుందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు.

అయితే తెలంగాణలోని పెద్దపల్లికి 10 కిమీ దూరంలో ఉన్న ఆ గ్రామాన్ని ‘మూడుజాముల కొదురుపాక’ అని పిలుస్తారు. ఈ ఊరిలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 జాములే ఉంటాయి. సాయంత్రం 4 గంటలకే అక్కడ చీకటి అవుతుంది. 4 దిక్కులా ఎత్తైన కొండలు, మధ్యలో ఊరు ఉండటంతో సూర్యుడు కొండల వెనక్కి వెళ్లి ఆ నీడ పడి త్వరగా ఆ గ్రామంలో చీకటి అవుతుంది. అలాగే ఈ గ్రామంలో సూర్యోదయం కూడా కాస్త ఆలస్యంగా జరుగుతుందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు.

మూడుజాముల కొదురుపాక గ్రామంలో ఉదయం 8 గంటలకు సూర్యోదయం, సాయంత్రం 4 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. ఎత్తైన పాము బండ గుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్టల మధ్యలో ఈ గ్రామం ఉండటం వల్ల ఆ కొండలు సూర్యరశ్మికి అడ్డం పడతాయి. ఇక ఈ ప్రకృతికి అలవాటుపడిన అక్కడి గ్రామస్తులు.. వారి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. సాయంత్రం నాలుగు తర్వాత లైట్లు వేసి.. పనులు సాగిస్తున్నారు.

అలాగే ఆ ఊరికి కొత్తగా వెళ్లినవారు.. వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట. కాగా, కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ‘క’ సినిమా మొదటి ఆట నుంచి హిట్ టాక్‌తో అదరగొడుతోంది. ఇప్పటివరకు ఏకంగా 19.41 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు సుజీత్, సందీప్ డైరెక్టర్లుగా వ్యవహరించారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *