హీరోయిన్ గా రాణించడం తేలికైన విషయం కాదు. చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. కొంతమంది స్టార్ హీరోయిన్స్ గా రాణించలేక సెకండ్ హీరోయిన్స్ గా చేస్తుంటారు. మరికొంతమంది మాత్రం యంగ్ హీరోలతో జోడీ కడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ హీరోయిన్ 13 ఏళ్లకు ఇండస్ట్రీలోకి వచ్చింది. అలాగే 19 ఏళ్లకే ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యింది. అయితే ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్ మయూరి కాంగో కూడా సినీ పరిశ్రమను వదిలిపెట్టి గూగుల్‌లో కెరీర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది.
అవును.. ఒకప్పుడు హిందీలో పాపులర్ సాంగ్స్ ‘పాపా కెహ్తే హై’ , ‘ఘర్ సే నిక్లాతే హై’ పాటలతో ఫేమస్ అయిన మయూరి కాంగో ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంది. 2000లో విడుదలైన ‘వంశీ’ ఆమె చివరి చిత్రం. ఆమె నర్గీస్, తోడ గమ్ తోడ ఖుషి, డాలర్ బాబు, కిట్టి పార్టీ వంటి అనేక టెలివిజన్ షోలలో కూడా నటించింది. అయితే 2003లో ఆమె సినిమా రంగాన్ని వదిలిపెట్టి తన భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడింది. అక్కడే బిజినెస్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసింది.
2004 2012 మధ్య ఆమె కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఐఐటీ ప్రవేశ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించింది. ఐఐటీ కాన్పూర్‌లో అడ్మిషన్ కూడా వచ్చింది, కానీ ఆ సమయంలో ఆమె నటనను కొనసాగించడానికి ఇష్టపడింది. 2013లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, మయూరి పెర్ఫార్మిక్స్లో మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆమె గూగుల్ ఇండియాలో చేరింది. 2019లో ఆమె గొప్ప విజయాన్ని సాధించింది. కొన్నాళ్లు గూగుల్ ఇండియాలో పని చేసింది.
సినిమా రంగం నుంచి సాంకేతిక ప్రపంచంలోకి అడుగుపెట్టి అనేక విజయాలు సాధించింది. ఇటీవల కొన్నాళ్ల క్రితం గూగుల్ ఇండియా ఇండస్ట్రీ హెడ్‌గా నటి మయూరి కాంగో నియమితులయ్యింది. మయూరి కాంగో కమ్యూనిస్ట్ నాయకుడు భాలచంద్ర కాంగో కుమార్తె. ఆమె ‘పాపా కెహతే హై’, ‘హోగీ ప్యార్ కీ జీత్’ వంటి సినిమాల్లో నటించింది. మయూరి డిసెంబర్ 2003లో ఔరంగాబాద్‌లో ఎన్నారై ఆదిత్య ధిల్లాన్‌ను వివాహం చేసుకుంది. మయూరి, ఆదిత్య మొదట ఒక పార్టీలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు.