తల్లైన అమ్మాయితో రెండో పెళ్లికి సిద్ధమైన డైరెక్టర్ క్రిష్. ఆ అమ్మాయి ఎవరో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

డైరెక్టర్ క్రిష్ .. తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను అలరించే ఈయన , చివరిగా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో వచ్చిన ‘కొండపొలం ‘అనే సినిమా చేశారు. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకకపోవడం, ఆయన రాజకీయాలలో బిజీ అవడం కారణంగా ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నారు.

ఇక ఈయన స్థానంలో నిర్మాత AM .రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడీ 2016లో రమ్య అనే వైద్యురాలితో కలిసి పెళ్లిపీటలెక్కారు. అయితే ఐదేళ్లకే వీరి వివాహ బంధం బీటలు వారింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు.

దీని తర్వాత రమ్య యూఎస్‌లో మరో పెళ్లి చేసుకుని సెటిల్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే అప్పటి నుంచి క్రిష్ మాత్రం సింగిల్ గానే ఉంటున్నాడు. అయితే ఇప్పడు కొత్త జీవితం ప్రారంభించేందుకు ఈ డైరెక్టర్ రెడీ అయ్యాడని సమాచారం. త్వరలోనే హైదరాబాద్‌ కి చెందిన ఓ డాక్టర్ తో అతని వివాహం జరగనుందని సమాచారం. వచ్చేవారంలోనే నిశ్చితార్థం కూడా జరగనుందనే టాక్ వినిపిస్తోంది.

వధువు విషయానికి వస్తే.. గతంలో ఆమెకు కూడా వివాహం అయిపోయిందని, అయితే కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయిందని తెలుస్తోంది. ఆమెకు 11 ఏళ్ల కుమారుడు సైతం ఉన్నాడని తెలుస్తోంది. ఇద్దరి వివాహానికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల ్రావడంతో త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *