గతంలో రష్మిక మందన్నా, డింపుల్ హయతి , నిధి ఆగర్వాల్, అషు రెడ్డి మరో ఇద్దరు ముగ్గురు కథానాయికలు సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి వద్ద పూజలు చేయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోకి మల్లేషం, వకీల్ సాబ్ ఫేం ఆనన్య నాగళ్ల చేరింది. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఇటీవల అనన్య నటించిన తాజా చిత్రం పొట్టేల్. అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. అయితే పొట్టేల్ కు ముందు తంత్రం అనే ఓ హారర్ సినిమాలో నటించింది అనన్య. క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంలో అనన్య ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామిని కలవడం చర్చనీయాంశంగా మారంది. వీరి ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి.
తాజాగా ఈ విషయంపై స్పందించింది అనన్య. వేణు స్వామిని కలవడానికి గల కారణాలను పంచుకుంది. ఇదే విషయంపై అనన్య స్పందిస్తూ.. ‘ సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ తో పాటు అద్రుష్టం కూడా ఉండాలని, ఆ రెండు కలసి ఉంటేనే సక్సెస్ అవుతామన్నారు. ఇక జాతకాలపై మాట్లాడుతూ ఇప్పటివరకు తాను ఎవరి దగ్గరా జాతకాలు చెప్పించుకోలేదని, తనకు అలాంటి అవకాశం, అలాంటి ఆలోచనలు అని రాలేదనీ, చిన్నప్పటినుండి జాతకాలను పట్టించుకోనని కరాఖండిగా చెప్పేసింది.
ఇక వేణు స్వామిని కలవడంపై స్పందిస్తూ.. తంత్రి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాను నేను స్వామి దగ్గరికి వెళ్ళానని, కానీ తన జాతకాన్ని చూపించుకోలేదన్నారు. కేవలం మూవీ ప్రమోషన్ కోసం మాత్రమే తాను వెళ్లానని, ఆయన కూడా తనని పూజల కోసం పిలవలేదని స్పష్టంగా చెప్పుకొచ్చింది అనన్య.