నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళల నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. శోభిత ఇంట్లో గోధుమరాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ కావడంతో ఇరు కుటుంబాలలో పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో నాగ చైతన్య , శోభితా ధూళిపాళ చాలా ప్రైవేట్‌గా ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే, ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలు నాగార్జున సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. దీంతో ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి.
అయితే వీరిద్దరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. సరిగ్గా నెలరోజల్లో అంటే.. వచ్చేనెల డిసెంబర్ 4, 2024న వివాహం జరుగుతుందని OTTplayలో నాగ చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లి వివరాలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ జంట పెళ్లికి సంబంధించిన వార్త మరొకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. స్టార్ జంట పెళ్లికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. నాగార్జున సొంత అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుందని నాగ చైతన్య సన్నిహితులు చెబుతున్నారు. స్టూడియో ఫ్లోర్లలో ఒకదానిలో ఒక చిన్న సెట్ ఏర్పాటు చేస్తున్నారట.
అయితే వీరి వివాహానికి కేవలం కొద్దిమంది అతిథులు మాత్రమే వస్తున్నారని సమాచారం. చైతు, శోభిత ఇద్దరూ ఆడంబరమైన పెళ్లిని కోరుకోలేదని తెలుస్తుంది. అయితే వీరి పెళ్లి జైపూర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో పెళ్లి జరగనుందని పుకార్లు కూడా వచ్చాయి, అయితే ఈ వార్తలు అవాస్తవం. పెళ్లి హైదరాబాద్‌లోనే జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. శోభిత ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పెళ్లి పనులు జరుగుతున్నాయని కొన్ని పిక్స్ కూడా షేర్ చేసింది. కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య , శోభితా ధూళిపాళ ఇటీవల ANR అవార్డుల కార్యక్రమంలో కలిసి కనిపించారు.
ఈ వేడుకకు అతిథిగా వచ్చిన చిరంజీవికి శోభితను పరిచయం చేస్తూ నాగార్జున కూడా హల్ చల్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక వర్క్ విషయానికి వస్తే.. నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో తన కొత్త చిత్రం తండేల్ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సినిమాలో సాయి పల్లవి మహిళా ప్రధాన పాత్రలో నటించింది. GA2 పిక్చర్స్ భారీ స్థాయిలో తండేల్ మూవీని నిర్మిస్తోంది. శోభిత ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది, పెళ్లి తర్వాత ఆమె హైదరాబాద్‌కు మకాం మారుస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి, పెళ్లికి సినీ పరిశ్రమకు ఆహ్వానం లేకపోవడంతో చాలా సన్నిహితంగా ఉంటుంది. ఈ పెళ్లికి సంబంధించిన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి.