బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్ చేసుకోవడం బెటర్. ఇక లేటెస్ట్ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. అయితే బంగారం ధరలు చూస్తుండంగానే దిగి వచ్చాయి. పసిడి రేటు పడిపోయింది. గోల్డ్ కొనే ప్లానింగ్‌లో ఉన్న వారికి ఇది ఊరట కలిగించే అంశం అని అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గడం వల్ల ఆ ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్ బంగారం ధరలను చూస్తే.. కేవలం 2 రోజుల కాలంలోనే భారీగానే తగ్గాయి. దాదాపు రూ.1000 వరకు పసిడి రేటు పతనం అయ్యింది. ఇది సానుకూల అంశం. పండుగ అయిపోయిన తర్వాత బంగారం ధరలు తగ్గాయి. అక్టోబర్ 31న బంగారం ధర రూ. 81,330 వద్ద ఉండేది. అయితే నవంబర్ 1న బంగారం ధర రూ. 80,560కు దిగి వచ్చింది. ఇక నవంబర్ 2న గోల్డ్ రేటు రూ. 80,400కు పడిపోయింది. అంటే గోల్డ్ రేటు రూ. 930 దిగి వచ్చింది. 24 క్యారెట్ల బంగారానికి ఈ రేట్లు వర్తిస్తాయి.
అలాగే పది గ్రాముల బంగారానికి ఈ ధర వర్తిస్తుంది. అదే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటును పరిశీలిస్తే.. ఈ బంగారం ధరలు కూడా నేల చూపులు చూశాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 31న రూ. 74,550 వద్ద ఉంది. తర్వాత నవంబర్ 1న చూస్తే.. ఈ గోల్డ్ రేటు రూ. 73,850కు దిగి వచ్చింది. ఇక నవంబర్ 2న పరిశీలిస్తే.. 73,700కు పడిపోయింది. ఇలా బంగారం ధర రెండు రోజులు పడిపోతూనే ఉంది.
వెండి ధరల వద్దకు వస్తే.. సిల్వర్ రేటు కూడా పడిపోయింది. వెండి రేటు అక్టోబర్ నెల చివరిలో రూ. 1,09,000 వద్ద ఉండేది. కేజీకి ఈ రేటు వర్తిస్తుంది. తర్వాత నవంబర్ 1న వెండి ధర రూ. 1,06,000కు దిగి వచ్చింది. నవంబర్ 2న కూడా ఇదే స్థాయిలో కొనసాగింది. కాగా పైన ఇచ్చిన బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అదనంగా పడుతుంది. అందువల్ల వీటిని కూడా కలుపుకుంటే ధరలు ఇంకా పై స్థాయిలో ఉంటాయి. కొనుగోలుదారులు ఈ విషయాన్ని గుర్తించాలి.