కిరణ్, రహస్య ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్సే. అయితే సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారీ లవ్ బర్డ్స్. తొలి చిత్రంతోనే అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకుంది. రీల్ లైఫ్ లోనే రియల్ లైఫ్ లోనూ వీరి ద్దరూ ప్రేమికులుగా మారారు. . దాదాపు ఐదేళ్ల నుంచి కిరణ్-రహస్య ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ ఏడాది తమ నిశ్చితార్థం ప్రకటనతో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి 13న వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది.
ఇప్పుడు పెళ్లితో తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారీ ప్రేమ పక్షులు. అయితే కిరణ్ అబ్బవరం.. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అందులో తన భార్య రసహ్య గోరఖ్ తో ప్రేమాయణం, పెళ్లి తదితర విషయాలు కూడా ఉన్నాయి. కాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘ఎంత కట్నం తీసుకున్నావు? అన్న ప్రశ్నకు ‘నేను కట్నం తీసుకోలేదు. నాకసలు అలాంటివి ఇష్టం ఉండవు.
కాకపోతే వాళ్ల కూతురికి ఏమైనా నచ్చితే పెట్టుకోనీ.. అది వాళ్ల ఇష్టం’ అని ఎంతో హుందాగా సమాధానమిచ్చాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. కిరణ్ అబ్బవరంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా రాజావారు రాణిగారు సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు కిరణ్, రహస్య గోరఖ్. వీరిద్దరికి ఇదే మొదటి సినిమా. అంతుకు మందు సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేశారు. అయితే సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చారు.
మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. సుమారు ఐదేళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ లవ్ బర్డ్స్ ఈ ఏడాది ఆగస్టు 22న పెళ్లిపీటలెక్కారు. కర్ణాటకలోని కూర్గ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక క సినిమా ప్రమోషన్లలోనూ తళుక్కుమంది రహస్య. తన భర్తకోసమైనా ఈ సినిమాను చూడాలంటూ ప్రేక్షకులను కోరింది.