కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో రాజావారు రాణిగారు సినిమా ద్వారా హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు, అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్లు కలకలం రేపాయి. ‘మీ సినిమాల్లో నన్ను ట్రోలింగ్ చేసే అంతగా ఏం చేశాను మీకు నేను?’ అంటూ కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అయ్యాడు. ‘గతంలో నేను చేసిన కొన్ని సినిమాలు డీసెంట్ గా ఉన్నాయి, మరికొన్ని ప్లాఫ్ అయ్యాయి. హిట్స్ ఫ్లాప్ అనేవి ఇండస్ట్రీలో కామన్. కానీ నా బాధ అది కాదు.
నేను ఏదో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాను. నా పని నేను చేసుకుంటూ వెళుతున్నాను. అలాంటిది నాపై సినిమాల్లో ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది కూడా రిక్వెస్టింగ్ గానే అడుగుతున్నాను. నామీద ఎందుకు ఇదంతా… మిమ్మల్ని ఏరోజైనా ఏమైనా అడిగానా.. సినిమాలో నామీద డైరెక్ట్ గా ట్రోలింగ్ ఎందుకు.. కనీసం నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అసలు నాతో ప్రాబ్లమ్ ఏంటి? నేను ఎదగకూడదా?’ అని భావోద్వేగానికి లోనయ్యాడు కిరణ్ అబ్బవరం.
కిరణ్ అబ్బవరం మాటలు ఆ ఈవెంట్ కు వచ్చిన నాగ చైతన్యతో పాటు అందరినీ కదిలించించాయి. విశ్వక్సేన్ లాంటి యంగ్ హీరోలు కిరణ్ అబ్బవరంకి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేసిన ఆ సినిమా ఏంటి? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అలా సెర్చ్ చేయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఇంతకీ కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేసిన సినిమా మరేదో కాదు ‘బాయ్స్ హాస్టల్’.
దీంతో అతని అభిమానులు, నెటిజన్లు ‘బాయ్స్ హాస్టల్’ దర్శకనిర్మాతలపై మండిపడుతున్నారు. అయితే ఈ విషయంలో ఆ సినిమా నిర్మాతలు క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.