ఈ ఏడాది అక్టోబర్ నెలంతా పండుగలతో క్యాలెండర్ నిండిపోయింది. దసరా పండుగ ముగిసిందో లేదో మూడు వారాల్లోనే దీపావళి వచ్చింది. అయితే పిల్లలు, పెద్దలు అందరూ ఆశగా ఎదురుచూసే పండుగ దీపావళి. అందరూ సంతోషంగా, ఆనందోత్సాహల మధ్య జరుపుకునే ఈపండుగ ఈసంవత్సరం ఎప్పుడు జరుపుకోవాలన్నదే ఇప్పుడు అందరికి అంతు చిక్కని సమస్యగా మారింది. అయితే పావళి పర్వదినాన్ని జరుపుకునేందుకు దేశప్రజలంతా సిద్ధమవుతున్నారు. కార్తీక మాసంలో అమావాస్య రోజున జరుపుకునే దీపావళి రోజు ఇంట్లో లక్ష్మీ దేవిని పూజిస్తే అదృష్టం కలిసొస్తుందని విశ్వసిస్తుంటారు.
ముఖ్యంగా దుకాణ సముదాయాల్లో లక్ష్మీ దేవి పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు. ఇక దీపావళి రోజున కొన్ని రకాల వస్తువులను దానం చేయడం కూడా మంచిదని పండితులు చెబుతున్నారు. దీపావళి రోజున చీపురు దానడం చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని పండితులు అంటున్నారు. సాధారణంగా చీపురును లక్ష్మీకి ప్రతిరూపంగా భావిస్తారనే విషయం తెలిసిందే. అలాగే పేదలకు ఆహారం, స్వీట్లు దానం చేయాలని చెబుతున్నారు. ఇలా చేస్తే మీ ఇంట సంతోషం వెల్లివిరియడం ఖాయమని అంటున్నారు.
కుబేరున్ని ప్రసన్నం చేస్తుందని, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు బాగుంటాయని అంటున్నారు. ఇక దీపావళి రోజున గోవుకు సేవ చేయడం కూడా మంచిదని అంటున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆవులు ఉండే ఆశ్రమానికి డబ్బును విరాళంగా అందించడం, ఆవులకు మేత వేయడం వల్ల మంచి జరుగుతుందని అంటున్నారు. ఇక దీపావళి రోజున చిన్న పిల్లలకు కొత్త బట్టలు దానం చేయడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుందని అంటున్నారు. దీపావళి రోజు ఇనుమును దానం చేయకూడదని పండితులు అంటున్నారు.
ఇలా చేయడం వల్ల దురదృష్టానికి దారి తీస్తుంది. ఇనుము రాహువుకు సంబంధించినదిగా పరిగణిస్తారు. ఇనుమును దానం చేయడం వల్ల రాహువు నుంచి చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే దీపావళి రోజున ఉప్పును దానం చేయకూడదు. ఇది మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుందని అంటున్నారు. దీపావళి రోజున డబ్బు లావాదేవీలు శుభప్రదంగా పరిగణించబడవు. ఈరోజు అప్పు చేయకూడదు, అలాగే ఎవరికీ అప్పు కూడా ఇవ్వొద్దు.