ఎక్సర్‌సైజ్ చేయకుండానే 21 రోజుల్లో బరువు తగ్గిన హీరో మాధవన్, అది ఎలానో తెలుసుకోండి.

divyaamedia@gmail.com
2 Min Read

హీరో మాధవన్.. కేవలం ప్రేమకథలే కాకుండా, వైవిధ్యమైన కథల్లో నటించి నటుడిగా కూడా తనకంటూ ఓ మార్క్‌ను సృష్టించుకున్నారు మాధవన్‌. ‘నా తర్వాత జనరేషన్‌లో నాకు నచ్చిన నటుడు మాధవన్‌’ అని కమల్‌హాసన్‌ అంతటి మహానటుడే కొనియాడంటే నటుడిగా మాధవన్‌ పొటెన్షియాలిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే కోలీవుడ్ నటుడు మాధవన్ కి తెలుగులో కూడా మార్కెట్ ఉండేది. తర్వాత ఆయన బాలీవుడ్ లో కూడా ఫేమస్ అయ్యాడు. కెరీర్ బిగినింగ్ లో మాధవన్ చేసిన సఖి, చెలి చిత్రాలను టాలీవుడ్ ఆడియన్స్ సైతం ఆదరించారు. మాధవన్ ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేశారు.

అలాంటి చిత్రాల్లో రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ ఒకటి. చేయని తప్పుకు జైలుపాలై సర్వం కోల్పోయిన ఏరోస్పేస్ సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రాకెట్రీ తెరకెక్కింది. ఈ చిత్రానికి మాధవన్ స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. నంబి నారాయణ్ పాత్ర కోసం మాధవన్ రాకెట్రీ మూవీలో వివిధ ఏజ్ గ్రూప్స్ లో కనిపిస్తారు. ఈ క్రమంలో ఆయన బరువు పెరిగి పొట్ట పెంచారు. ఆ మూవీ చిత్రీకరణ సమయంలోని మాధవన్ ఫోటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. భారీ పొట్టతో ఊబకాయుడిగా ఉన్న మాధవన్ ని చూసి అభిమానులు షాక్ అయ్యారు.

ఈయన మన లవర్ బాయ్ మాధవనా లేక వేరొకరా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇక పాత్ర కోసం బరువు పెరిగిన మాధవన్ కేవలం 20 రోజుల్లో పూర్వ స్థితికి వచ్చాడట. అందుకు నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు. కేవలం ఆహార నియమాలు, జీవన శైలితో బరువు తగ్గానని మాధవన్ చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఆహారాన్ని 45 నుండి 60 సార్లు బాగా నమిలి మింగేవాడిని. నీళ్లను నమలాలి ఆహారాన్ని తాగాలి. అప్పుడప్పుడు ఉపవాసం ఉండేవాడిని.

రోజులో నా చివరి భోజనం 6:45 నిమిషాలకు పూర్తి అయ్యేది. జ్యూస్ లు ఎక్కువగా తాగేవాడిని. ఆకుకూరలు ఎక్కువగా తినేవాడిని. ఉదయాన్నే సుదీర్ఘంగా నడిచేవాడిని. నిద్రపోవడానికి 90 నిమిషాల ముందు ఎలాంటి స్క్రీన్ చూడను. నా ఆరోగ్యానికి, శరీరానికి, జీవన శైలికి సరిపడే ఆహారం తీసుకున్నాను. కఠిన వ్యాయామాలు కూడా చేయలేదు.. అని మాధవన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హిందీ, తమిళ్ చిత్రాలు చేస్తూ మాధవన్ బిజీగా ఉన్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *