బంగారం ధరలు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి. పండగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుండటంతో.. దేశీయంగా కూడా ఆ ప్రభావం పడుతోంది. గత నాలుగు రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన రెండు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ. 500 మేరకు తగ్గింది.
గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ధరలు కాస్త శాంతించడం, అమెరికాలో ఎన్నికలు సమీపిస్తుండటం..లాంటి అంశాలు దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గడానికి కారణం కావచ్చునని బిజినెస్ నిపుణులు అంటున్నారు. హైదరాబాద్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 460 మేరకు తగ్గి.. రూ. 73,140 దగ్గర కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 500 మేరకు తగ్గి.. రూ. 79,790 దగ్గర స్థిరంగా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140 దగ్గర ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,790గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,290 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 79,940. ముంబయి, కోల్కతా, బెంగళూరు, చెన్నై నగరాల్లో.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 73,140 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,790. దేశవ్యాప్తంగా వెండి ధరల్లో కాస్త హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత వారం చివరి నుంచి సుమారు రూ. 6 వేలు తగ్గిన వెండి ధర.. గడిచిన మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. ఇక మంగళవారం స్వల్పంగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,06,900. అలాగే కోల్కతా, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.97,900. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 96,900కు చేరింది. ఈ ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్ చేసుకోవడం బెటర్. ఇక లేటెస్ట్ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.