ప్రామిసరీ నోట్ ఉన్నా .. మీ అప్పు చెల్లించకపోతే మీరు చెయ్యాల్సిన మొదటి పనులు ఇవే.

divyaamedia@gmail.com
2 Min Read

ప్రామిసరీ నోట్లు రాయించుకోవటం సర్వ సాధారణం. సదరు ప్రామిసరీ నోట్లపై ఇచ్చే వారి వివరాలు, తీసుకునే వారి వివరాలు, తీసుకున్న మెుత్తం సొమ్ము, వడ్డీ రేటు, సాక్షి సంతకాలు వంటి వివరాలు ఉంటాయి. దీనికి ఒక స్టాంప్ కూడా అంటిస్తారు. దానిపై డబ్బు తీసుకున్న వారు సంతకం లేదా వేలి ముద్ర తీసుకుంటారు. అయితే ప్రామిసరీ నోట్లు ఎక్కువగా గ్రామాల్లో ఉపయోగిస్తారు. వ్యవసాయం పనులకోసం గ్రామాల్లోని వ్యక్తులు అవసరాల కోసం లేదా ఏదైనా అత్యవసరమైనప్పుడు ఇతరుల దగ్గర వడ్డీకి తెచ్చుకుంటారు.

ఈ ప్రామిసరీ నోట్‌లో వడ్డీ రేటు, తిరిగి చెల్లింపు షెడ్యూల్, నోటు చెల్లుబాటు అయ్యే తేదీ మరిన్ని వివరాలు ఉంటాయి. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి అప్పు తీసుకున్నప్పుడు ఈ నోట్‌పై సంతకం చేసి.. సాక్ష్యుల సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డబ్బు తీసుకున్న పర్సన్ సరైన సమయానికి చెల్లించకపోతే కోర్టులో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కోర్టుకు డిఫాల్ట్ సాక్ష్యాన్ని అందించాక.. నోట్ చెల్లు బాటు అయ్యిందని ప్రూవ్ అయ్యాక డబ్బు కట్టని వ్యక్తిని కోర్టు విచారణకు హాజరవ్వమని నోటీసులు పంపుతుంది.

ఈ సమస్యను కొంతమంది కోర్టు వరకు వెళ్లకుండా మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకుంటారు. ఎలాంటి గొడవ పడకుండా స్నేహపూర్వకంగా సాల్వ్ చేసుకుంటారు. ప్రామిసరీ నోటు చట్టపరంగా ఆమోదయోగ్యతను పొందటానికి ఉండాల్సిన వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పామిసరీ నోటు రాతపూర్వకంగా ఉండాలి. అప్పు తీసుకునే వారి పేర్లు క్లారిటీగా ఉండాలి. షరతులు లేకుండా ఉండాలి. మనం డబ్బు ఎవరికి ఇస్తున్నామో.. ఇచ్చే వార్ల పేర్లు, ప్రామిసరీ నోటు రాసిన ప్లేస్, తేదీలు కూడా క్లారిటీగా రాయాలి.

అప్పుగా ఎంత డబ్బు ఇచ్చామో అంకెల్లో రాయాలి. అలాగే అక్షరాల్లో కూడా రాయాలి. తర్వాత రెవెన్యూ స్టాంప్ అంటించాలి. ఇరుపక్షాల వారు సంతకాలు చేయాలి. వీరితో పాటుగా సాక్ష్యుల సంతకాలు.. అలాగే వారి వివరాలు కూడా ఉండటం బెటర్. అంతేకాకుండా ఈ ప్రామిసరీ నోటులో డబ్బు చెక్కు ద్వారా ఇచ్చారో.. లేదా నగదు ఇచ్చారో కూడా రాయాలి. చివర్లో ప్రామిసరీ నోటులో పోస్టాఫీసు జారీ చేసిన రెవెన్యూ స్టాంప్‌లను అతికించాలి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *