సాయి పల్లవి జంటగా తెరకెక్కిన అమరన్ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా భారత ఆర్మీకి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో తెరకెక్కించారు. అయితే గ్లామర్ ఒలకబోస్తేనే హీరోయిన్‌లు అవ్వొచ్చు. తిరుగులేని పాపులారిటీ తెచ్చుకోవచ్చు అని అనుకుంటున్న నేటి తరంలో.. గ్లామర్‌కు అతీతంగా సినిమాలు చేస్తూ… స్టార్ హీరోయిన్‌లకు సైతం లేని అభిమానగళాన్ని సంపాదించుకుంది సాయి పల్లవి. సాయి పల్లవి స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. హీరోల రేంజ్‌లో ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తారు.
సుకుమార్ సైతం సాయి పల్లవి క్రేజ్ చూసి, లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చాడంటే ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మహానటి సావిత్రి, సౌందర్యల తర్వాత ఆ రేంజ్‌లో తెలుగులో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అలా అని ఈ మలయాళ కుట్టి వందేసి కోట్ల సినిమాలు చేయలేదు. ఆమె నటించిన సినిమాలు వందల కోట్ల కలెక్షన్లు కూడా కొల్లగొట్టేలేదు. కానీ.. తన నటన, అభినయంతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. అంతగా ఆమెపై ఆడియెన్స్ అభిమానం పెంచుకోవడానికి కారణం సాయి పల్లవి ఎంచుకున్న పాత్రలు.
ఆమె సినిమాలు రిలీజవుతున్నాయంటే.. ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం మరోమారు ఆలోచించకుండా థియేటర్‌ల వైపు అడుగులు వేస్తుంటారు. ఆన్ స్క్రీన్‌లోనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ సాయి పల్లవి చాలా పద్దతిగా, ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తుంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో తండేల్‌తో పాటు రామాయణం సినిమాలు ఉన్నాయి. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమా దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాలో బుజ్జి రోల్ చేస్తుంది.
ఈ మూవీతో పాటు రామాయణంలో సీతా దేవి రోల్ చేస్తుంది. వీటితో పాటుగా.. దీపావళికి రిలీజ్ కాబోతున్న అమరన్‌లో కూడా ఈ భామనే హీరోయిన్. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు ఆడియెన్స్‌లో మాములు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మరీ ముఖ్యంగా సాయి పల్లవి చాలా క్యూట్‌గా అనిపించింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సాయి పల్లవి తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం సాయి పల్లవి రూ.3 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.