ఊరు అవతల బంగ్లాలో స్టార్ హీరోయిన్, చివరికి స్టింగ్ ఆపరేషన్‌లో..!

divyaamedia@gmail.com
2 Min Read

తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు చాలా ఇండ‌స్ట్రీల‌ను ప‌ట్టి పీడిస్తున్న ఓ మ‌హ‌మ్మారి ఇది. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లు మొత్తం ప‌ని గ‌ట్టుకుని మ‌రీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. అయితే హీరోయిన్ అంటే రీల్ అయినా రియల్ అయినా ఫాలోయింగ్ అనేది ఉంటుంది.. ఇక ఆ ఫాలోయింగ్ కొన్ని కంఫర్ట్ ఇస్తే మరికొన్ని కంపరం పుట్టిస్తాయి. ఇక కంఫర్ట్ ఫాలోయింగ్ అంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్.. కంపరం పుట్టించే ఫాలోయింగ్ అంటే క్యాస్టింగ్ కౌచ్.. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఓ హీరోయిన్ ఊరు అవతల బంగ్లాలో గంటలు గంటలు గడిపేదట..!

అది గమనించిన కొన్ని మీడియా వర్గాలు ఆమె ఎక్కడికి వెళ్తుంది..? వెళ్తే అక్కడ నాలుగైదు గంటలు ఏం చేస్తుంది? ఏంటి అని అరా తియ్యడం మొదలెట్టారట.. చివరికి అయ్యేది కాదని స్టింగ్ ఆపరేషనే చేశారు.. అలా చెయ్యడంతో చివరికి ఓ షాకింగ్ నిజం తెలిసింది… ఏంటి అది అనుకుంటున్నారా? అసలు ఆమె ఎవరు అని అనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్నాం…! స్టింగ్ ఆపరేషన్ చేసింది ఎవరిపైనో కాదు.. హీరోయిన్ నమితపైన.. సినిమాల్లోకి వచ్చినప్పుడు సన్నగా మల్లెపువ్వులా ఉన్న నమిత కొంతకాలానికే గుండుమల్లెలా తయారయ్యింది.

కొన్ని సినిమాలకే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నమిత లావు అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారు.. ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి.. దాంతో ఆమె సన్నగా అవ్వాలని ఫిక్స్ అయ్యింది. ఇంకా అలానే సన్నగా అవ్వడం కోసం ఆమె సల్సా డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టింది.. సన్నగా అవ్వడంతో పాటు ఒక కల కూడా నేర్చుకోవచ్చు అనుకున్నారో ఏంటో మరీ. ఆ సల్సా డ్యాన్స్ ఏంటో ఇంట్లో నేర్చుకోకుండా ఆమె ఊరు అవతల ఉన్న ఓ బంగ్లాలో ఓ టీచర్ దగ్గర నేర్చుకునేది.

బయటేమో.. ఆమె రోజు ఆ బంగ్లాకు వెళ్లి నాలుగైదు గంటలు ఉండేసరికి అక్కడ మీడియా సైలెంట్ గా ఉండలేకపోయింది. ఇక అలానే స్టింగ్ ఆపరేషన్ చేస్తే.. చివరికి ఆమె ఊరు అవతల బంగ్లాలో సల్సా డ్యాన్స్ నేర్చుకుంటుందని అని తెలిసేసరికి అప్పట్లో పెద్ద రచ్చే అయ్యింది.. ఆ విషయం అప్పట్లో ట్రేండింగ్ ప్లేస్ ఎవర్ గ్రీన్ కామెడీ స్టింగ్ ఆపరేషన్ లా మిగిలిపోయింది.. మరీ ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటీ?

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *