శ్రావణ మాసంలో శివుడు, విష్ణువు, సుబ్రహ్మణ్యుడు ఇలా ఎంతమందికి పూజ చేసినా లక్ష్మీ పూజ అంటే అందరికీ ఇష్టమేకదండీ. సాక్షాత్తూ ఆ శ్రీమహలక్ష్మి మన ఇంట్లో కొలువుతీరి, మనకి వరాలివ్వాలని కోరుకోనివారెవరు చెప్పండి. అయితే ధనత్రయోదశి రోజున ధన్వంతరి, లక్ష్మీదేవి, కుబేరుడిని పూజించే సంప్రదాయం ఉంది. అయితే మన దేశంలో అనేక ఆలయాలున్నాయి. శివుడు, కృష్ణుడు , హనుమంతుడు వంటి దేవుళ్లతో పాటు అమ్మవారికి కూడా ఆలయాలున్నాయి. అయితే మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లోని ఖిల్చిపూర్‌లో కుబేరుడి ఆలయం ఉంది.
ఈ ఆలయంలో కుబేరుడితో పాటు శివ పార్వతులు భక్తులతో పూజలను అందుకుంటున్నారు. దీంతో కుబేరుడు పూజలందుకుంటున్న ఏకైక ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ధన త్రయోదశి రోజున ఈ ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకు తంత్రపూజ ఆనవాయితీగా వస్తోంది. దీని తర్వాత భక్తులు కుబేరుడి దర్శనం ఇస్తాడు. ఇక్కడ పూజలు చేయడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇక్కడ ప్రతిష్టించిన శిల్పాలు 1300 సంవత్సరాల నాటివని.. అంటే ఖిల్జీ సామ్రాజ్యానికి పూర్వం ఉన్నవని చెబుతారు.
అదే సమయంలో ఈ ఆలయ గర్భగుడికి ఇప్పటి వరకు తాళం వేయలేదని ఈ ఆలయ పూజారులు చెబుతున్నారు. ఈ గర్భాలయానికి తలుపు కూడా ఉండేది కాదు. ఈ ఆలయంలో నాలుగు చేతులతో కూడిన కుబేరుడి విగ్రహం ఉంది. ఒక చేతిలో డబ్బుల కట్ట, మరో చేతిలో ఆయుధం, మిగిలిన చేతిలో కప్పు ఉన్నాయి. అలాగే కుబేరుడు ముంగిసపై స్వారీ చేస్తున్నాడు. ఈ ఆలయాన్ని మరాఠాల కాలంలో నిర్మించారని కూడా చరిత్రకారులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ ఆలయంలో ఉన్న కుబేరుడి విగ్రహం గుప్తుల కాలం నాటి 7వ శతాబ్దంలో తయారు చేయబడింది.
ఈ కుబేరుడి ఆలయాన్ని ఒక్కసారి దర్శించి ఇక్కడ ఉన్న కుబేరుడిని పూజిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతారు. దీంతో కోరుకున్న కోరిక నెరవేరతాయని విశ్వాసం. అటువంటి పరిస్థితిలో.. కుబేరుడి ఆశీస్సులు పొందాలనుకునే వారు ధన త్రయోదశి రోజున కుబేరుడి దర్శనం కోసం భారీ సంఖ్యలో ఈ ఆలయానికి చేరుకుంటారు.