పల్నాడు జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బాధితుడు తనను ఎవరైనా కాపాడితే బాగుండు అనుకుంటున్న సమయంలో.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. ఆ బాధితుణ్ని కాపాడారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్న జానీ మాస్టర్ ను చాలామంది ద్వేషిస్తున్నారు. అతనికి బెయిల్ ఇవ్వాల్సింది కాదంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన గొప్ప మనసును చాటుకున్నాడు జానీ మాస్టర్.
ఒక మంచి పని చేసి తన అభిమానులు, నెటిజన్ల మనసులు గెల్చుకున్నాడు. ఇంతకు ఏం జరిగిందంటే.. జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్ హైదరాబాద్ నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరుకు పయనమయ్యాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం, బ్రాహ్మణపల్లి సమీపానికి వచ్చే సరికి ఓ పెద్దాయన రోడ్డు మీద తీవ్రమైన గాయాలతో పడి ఉన్నాడు. ఎవరైనా వచ్చి తనను కాపాడితే బాగుండు అనుకుంటున్న సమయంలోనే అటుగా జానీ మాస్టర్ వచ్చాడు.
గాయపడిన పెద్దాయనను చూశారు. ముందుగా ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ వెంటనే 108కి ఫోన్ చేశారు. జానీ మాస్టర్ ఫోన్ చేసిన కొద్ది సేపటికే 108 అంబులెన్స్ వచ్చింది. అప్పటివరకూ ఆ పెద్దాయన దగ్గరే ఉన్న జానీ మాస్టర్.. స్వయంగా ఆయన్ని అంబులెన్స్‌లో తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమా్ల్లో వైరల్ గా మారాయి. జానీ మాస్టర్ చేసిన పనిని అభిమానులు, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
తాను సమస్యల్లో ఉన్నా.. ఎవరో తెలియని వ్యక్తికి సాయం చేయడం, ఎదురు చూసి మరీ అంబులెన్స్ లో పంపించడంతో మాస్టర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
రోడ్ ఆక్సిడెంట్ లో గాయాలపాలైన వ్యక్తికి సాయం చేసిన జానీ మాస్టర్.
— NewsWala (@NewsWalaTelugu) October 27, 2024
ఏపీ పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లిలో బైక్‌పై నుంచి ఓ వ్యక్తి కిందపడగా.. అటుగా వెళ్తున్న జానీ మాస్టర్.. 108కి ఫోన్ చేసి, అంబులెన్స్‌లో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.@AlwaysJani#JaniMaster pic.twitter.com/WhKHleNoP3