ప్రగతి ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. ఏమైంది ఈవేళ సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది. ప్రగతి కేవలం నటి మాత్రమే కాదు. 2023లో నిర్వహించిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో ఆమె కాంస్య పతకం సాధించింది. సినిమాల్లో ఎక్కువగా ఆమె హీరోఎం హీరోయిన్స్ తల్లి పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సినిమా ఏదైనా ప్రగతి ఖచ్చితంగా ఉంటారు. అయితే ఇకపోతే ఈమధ్య కాలంలో తల్లి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె సినిమా ఏదైనా సరే కచ్చితంగా ప్రగతి ఉండాల్సిందే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
ముఖ్యంగా కార్టూన్ పాత్రలకి కూడా ఈమె డబ్బింగ్ చెప్పింది అంటే ఎవరైనా నమ్మగలరా..? అలాగే ఒక యాడ్ లో కూడా నటించింది ప్రగతి. ఆ యాడ్ చూసిన ఒక కోలీవుడ్ డైరెక్టర్ కే.భాగ్యరాజ్ ఈమె అందానికి , నటనకు ఆకర్షితుడై వీట్ల విశేషంగా అనే చిత్రంలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా ఏడు సినిమాలు తమిళ్ లో, ఒక మలయాళం సినిమాలో కూడా నటించడం జరిగింది. కెరియర్ పీక్స్ లో ఉన్నట్లుగానే వృత్తికి కాస్త బ్రేక్ ఇచ్చిన ఈమె వివాహం చేసుకొని మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.
ఇప్పుడు సినిమాలే కాదు సీరియల్స్ లో కూడా నటిస్తూ తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది. ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ప్రగతి మాట్లాడుతూ.. ఒక నటుడు చేసిన ఒక పనికి నేను ఇప్పటికి ఆశ్చర్యానికి గురవుతూనే ఉంటాను. అసలు ఆ సమయంలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆ నటుడు నాతో చాలా పద్ధతిగా ఉండేవాడు. అయితే ఎందుకో ఏమైందో తెలియదు కానీ ఆ క్షణం సెట్లో ఉన్నట్టుండి అందరి ముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు.
నమ్మిన వ్యక్తి మోసం చేశాడనిపించింది. ఎంతో బాధపడ్డాను. ఆ బాధతో భోజనం కూడా చేయాలనిపించలేదు. అంతేకాదు ఆరోజు షూటింగ్ కూడా నేను వెళ్లలేకపోయాను. తీవ్ర మానసిక వేదన అనుభవించాను అంటూ ప్రగతి తెలిపింది.