కుక్కలు మనల్ని చూసి వెంబడిస్తూ మొరుగుతుంటాయి. అప్పుడు మనకు ఏమి చేయాలో తెలియక మరో దారిలో వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుంటాం. అయితే కుక్కలు మీ కారు లేదా బైక్ వెనుక పరుగెత్తుతుంటాయి. దీంతో ఒక్కోసారి ప్రమాదాలు జరిగి తీవ్ర గాయాలపాలయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాన్ని వేగంగా నడపకూడదు. కుక్కలు ఎదుట పడినప్పుడు వాహనాన్ని చాలా నెమ్మదిగా నడపండి. వాహనాన్ని వేగంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కుక్కలు మరింత దూకుడుగా ప్రవర్తిస్తాయి. అయితే కుక్కలు మీ వెంట పరుగెత్తినా లేదా మిమ్మల్ని చూసి మొరగడం స్టార్ట్ చేసినా.. మీరు టెన్షన్ పడకండి. భయపడకండి.
వాటి ముందు మీరు ప్రశాంతంగా, స్థిరంగా నిలబడండి. ఇలా కాకుండా.. అరుస్తున్నాయనో లేక వెంటపడుతున్నాయనో మీరు పరుగెత్తితే మాత్రం కుక్క మీపై ఖచ్చితంగా దాడి చేస్తుంది. మీ వెండ పడుతుంది. అందుకే మీరు ఇలాంటి సమయంలో కదలకుండా స్థిరంగా, ధైర్యంగా ఉంటే.. కుక్కల దూకుడు తగ్గుతుంది. అలాగే పక్కకు వెళ్లిపోతాయి. గట్టిగా అరవండి.. కుక్కలు మిమ్మల్ని చూసి అరిచినా, మీ దిక్కు వస్తున్నా.. గట్టిగా అరవండి. బిగ్గరగా నో లేదా స్టాప్ అని అనండి. చాలా కుక్కలు ఈ పదాలను గుర్తించి ప్రతిస్పందిస్తాయి.
మీరు ఆర్టర్ వేసినట్టు అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాయి. వీటితో రక్షించుకోండి..మీదగ్గర ఏదైనా బ్యాగ్ లేదా గొడుగు, జాకెట్ వంటి ఎలాంటి వస్తువు ఉన్నా.. దాన్ని మీరు కుక్కల దాడి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కుక్క మీకు దగ్గరగా వచ్చినప్పుడు మీ దగ్గరున్న వస్తువులను మీకు, కుక్కు మధ్యన పెట్టండి. ఇది కుక్కను తికమక పెడుతుంది. అలాగే దీనివల్ల కుక్క మీపై దాడి చేయకుండా ఉంటుంది. నెమ్మదిగా వెనక్కి అడుగు..కుక్క మీపై దాడి చేయడానికి సిద్దంగా ఉంటే.. దాని నుంచి వెంటనే పారిపోయే ప్రయత్నం మాత్రం చేయకండి.
కుక్క మీకు ఎదురుగా ఉన్నప్పుడు వెంటనే పారిపోవడానికి బదులు నెమ్మదిగా వెనక్కి వెళ్లండి. అలాగే కుక్కను గమనించండి. త్వరగా దూరంగా వెళ్లడానికి లేదా పారిపోవడానికి ప్రయత్నిస్తే కుక్క మీపై చాలా ఫాస్ట్ గా దాడి చేస్తుంది. శాంతపరచడానికి ప్రయత్నం..కుక్క మీపై దాడికి ప్రయత్నించినప్పుడు దానిపై అరవడానికి బదులుగా.. దాన్ని ప్రేమగా చూడండి. అలాగే మీ మాటలతో దానిని శాంతపరచడానికి ప్రయత్నించండి. కుక్క మొరిగితే లేదా పరిగెత్తితే.. కూల్ గా ఉండమని లేదా నిశ్శబ్దంగా లేచి నిలబడమని ప్రేమగా అడగండి. కుక్కలకు మన ఎక్స్ ప్రెషన్స్ బాగా అర్థమవుతాయి.