తన అసిస్టెంట్ పై ఆయన అత్యాచారం చేయడం అలాగే ఆమెను బెదిరించడం కూడా చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ జానీ నేను ఏ తప్పు చేయలేదు. కావాలనే నన్ను ఇరికించారు అని అంటున్నారు. అలాగే జానీ మాస్టర్ భార్య కూడా తన ఎదుగుదలను చూసి కావాలనే ఇలా చేశారు అని ఆరోపిస్తుంది. అయితే తాజాగా అనీ మాస్టర్ జానీ మాస్టర్ కేసు విషయంలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
ఎవరైతే జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేశారో.. ఆ యువతి తనకు తెలుసంటూ.. అవకాశాల కోసం ఆమెకు తరచూ మెసేజ్ చేసేదంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తానే జానీ మాస్టర్ దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చానని.. జానీ మాస్టర్ తనకు లైఫ్ ఇచ్చాడని తెలియజేశారు. ఇన్నీ రోజులు ఈ విషయాలు చూస్తూ చాలా ఆందోళనకు గురయినట్లు చెప్పారు. గతంలో ఆమె జానీ మాస్టర్ తో కలిసి అనేక సినిమాలు చేశానని.. ఆయన ఎప్పుడు కూడా తప్పుగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు.
అలాగే ఆ యువతి ఇన్నేళ్లు ఆయన దగ్గర పని చేసి.. ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. అంతే కాకుండా ఎంతో కష్టపడి ఈ స్థాయి వరకు చేరుకున్న వ్యక్తికి.. ఆ అవార్డు రద్దు చేయడం కూడా చాలా బాధగా ఉందని అన్నారు. ఒకవేళ బాధిత యువతికి నిజంగానే అన్యాయం జరిగి ఉంటే మాత్రం.. ఆమెకు మద్దతుగా నిలుస్తానని వెల్లడించారు అనీ మాస్టర్. అయితే కోర్టు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి.. ఇప్పటికి జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తున్నట్లు వ్యక్తం చేశారు.
మొదటి నుంచి అటు జానీ మాస్టర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే మాట మీద ఉన్నారు. కానీ రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం తప్పు ఒప్పుకున్నట్లు తెలిసింది. అప్పటినుంచి జానీ మాస్టర్ పోలీసుల కస్టడీ లోనే ఉన్నారు. మరి కోర్టు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఏమౌతుందో చూడాలి. మరి అనీ మాస్టర్ జానీ మాస్టర్ పై స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.